Telugu Movie News | Telugu News | Cinema News

పవన్ ఫ్యాన్స్ కోసం అనిరుద్ పవన్ కళ్యాణ్

1

పవన్ ఫ్యాన్స్ కోసం అనిరుద్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా కోసం ప్రస్తుతం మెగా అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ఫైనల్ గా పూర్తయ్యింది. రేపు ఘనంగా నోవొటెల్ లో ఆడియో వేడుకను జరపబోతున్నారు. అయితే ఈ వేడుకలో అనిరుద్ గంటపాటు ఇచ్చే పర్ఫెమెన్స్ అందరిని ఆకట్టుకోనుందట. పవన్ ఫ్యాన్స్ కోసం అనిరుద్ పవన్ కళ్యాణ్ గత చిత్రాలలోని హిట్ సాంగ్స్ ని పాడబోతున్నాడట. దీంతో అభిమానులు ఆడియో వేడుకను చూడాలని చాలాఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా సినిమాలోని కొన్ని పోస్టర్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కీర్తి సురేష్ – అను ఇమ్మాన్యుయేల్ తో పవన్ స్టిల్స్ చాలా బావున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆడియో ట్రాక్ లిస్ట్ ను కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

 

Leave A Reply

Your email address will not be published.