Telugu Movie News | Telugu News | Cinema News

న్యూ ఇయర్ పై షాకింగ్ డెసిషన్..!

15

న్యూ ఇయర్ పై షాకింగ్ డెసిషన్..!

ఏపీ ప్రభుత్వం సంచలనాత్మక జీవో జారీ చేసింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేవాలయాలలో ఎటువంటి పూజలు నిర్వహించుకుడదనేది జీవో సారాంశం. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదికి మాత్రమే దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖా కమిషనర్ ఆదేశాలు పంపారు.న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ భారతీయ సంసృతికి విరుద్ధం అనేలా ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపింది.

జనవరి 1 న శుభాకాంక్షలు తెలపడం విదేశీ సంస్కృతి అని హిందూ ధర్మ పరిరక్షణ కార్యదర్శి విజయ రాఘవాచార్యులు అన్నారు. జనవరి 1 న దేవాలయాల్లో పూజలు నిర్వహించేందుకు భక్తులు క్యూకట్టే విషయం తేలింది. వారందరికీ ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యకగా అనిపిస్తోంది. ఏపీ దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్న బిజెపి నేత మాణిక్యాల రావు ఎఫక్ట్ ఇది అని అంతా చర్చించుకుంటున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని హిందూ ధార్మికులు ప్రశంసిస్తుంటే.. గుజరాత్ మార్క్ రాజకీయాలు ఏపీలో కూడా మొదలయ్యాయి అంటూ మరి కొందరి నుంచి సెటైర్లు పడుతున్నాయి

Comments are closed.