Telugu Movie News | Telugu News | Cinema News

‘బీజేపీకి తృటిలో తప్పిన ప్రమాదం’

2

‘బీజేపీకి తృటిలో తప్పిన ప్రమాదం’

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి తృటిలో ప్రమాదం తప్పిందని, ప్రజాగ్రహం మరికొంత పెల్లుబుకి ఉంటే ఫలితాలు తారుమారయ్యేవని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి మాటలు చెప్పే బీజేపీ ఎన్నికల ప్రచారం వచ్చేసరికి కుల, మతాలనే ఎప్పుడూ తెరపైకి తెస్తుందని తప్పుపట్టారు. కేవలం ఈ రెండింటి ఆధారంగానే బీజేపీ ఓట్లు గెలుస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ‘వికాస్’ (అభివృద్ధి) పేరుతో కాకుండా కులం, మతం ప్రాతిపదికగానే గెలుపు సాధించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఓటమి పాలైనా, పటీదార్, ఓబీసీ, దళిత నేతలైన హార్దిక్, అల్పేష్, జిగేష్‌లతో కలిసి పనిచేయడంలో చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇదే వ్యూహాన్ని పునరావృతం చేయాలని కోరారు. ప్రాంతీయ భాగస్వాములను కలుపుకుంటూ వెళ్లాలని అఖిలేష్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.