Telugu Movie News | Telugu News | Cinema News

తెలుగు రాష్టాల్లో బీజేపీ రాత మారనుందా?

2

తెలుగు రాష్టాల్లో బీజేపీ రాత మారనుందా?

మోడీ పాలనలో భారత జనతా పార్టీ ఖ్యాతి బాగానే పెరుగుతూ వస్తోంది. ఎటువంటి ఎన్నికలు జరిగినా
రికార్డ్ మెజారిటీతో బీజేపీ సత్తాను చాటుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి ఇంకా సరైన గుర్తింపు దక్కడం లేదు. కనీసం ఎమ్మెల్యే స్థానాలను కూడా దక్కించుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏళ్ల నుంచి పార్టీని కొనసాగిస్తున్నా ఇంకా సరైన స్థాయికి ఎదగడం లేదు. గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం దేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న కనీస స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. తెలంగాణలో కొన్ని స్థానాల్లో మాత్రం పార్టీ బలంగా ఉంది.

కానీ నాయకులు పార్టీని ఇంకా బలంగా చేయలేకపోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో అయితే ఏ మాత్రం తన స్టామినని చూపలేకపోతోంది. అయితే వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో గెలవడం కొంచెం కష్టమే కావచ్చు. కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపే విధంగా అడుగులు వేయాలని చూస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా అందుకు ప్రణాళికలని కూడా రుపోందిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన ఆంద్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి భారీ ఎత్తున సభలను జరిపి ఆంద్రప్రదేశ్ లో బీజేపీకి బలాన్ని చేకూర్చాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఎలక్షన్ లో వీలైనన్ని సీట్లను గెలుచుకోవాలని పక్క ప్రణాళికలతో వెళ్లనున్నారట. ముందుగా గ్రామస్థాయి నుండి పార్టీ కేడర్ బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. ఆంద్రప్రదేశ్ – తెలంగాణ లోని బీజేపీ ముఖ్యనాయకులు మరికొన్ని రోజుల్లో ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో చర్చలు జరపడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ చర్చల తరువాత బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.