Telugu Movie News | Telugu News | Cinema News

మహిళా ఎమ్మెల్యే చెంపను చెళ్లుమనిపించిన కానిస్టేబుల్

6

మహిళా ఎమ్మెల్యే చెంపను చెళ్లుమనిపించిన కానిస్టేబుల్

ఒక్కోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన వలన పోలీసులకు కోపం చాలా వస్తుంది. కానీ ప్రజానాయకుడికి గౌరవం ఇవ్వాలని ఆగ్రహాన్ని అణచివేసుకుంటారు. పొలిటీషియన్స్ చేసే పనికి పోలీసులు ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. నాయకులను అడ్డుకుంటే వారు కొట్టాడానికి వస్తుంటారు. అయితే కొన్ని సార్లు పోలీసులు కోపం ఆపుకోలేక కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటి సారి ఎవరు ఊహించని విధంగా ఒక మహిళా కానిస్టేబుల్ మరో మహిళా నేత చెంపని చెల్లు మనిపించింది.

వివరాల్లోకి వెళితే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో రీసెంట్ గా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఒక స‌మీక్ష నిర్వ‌హించారు. చాలా మంది అక్కడికి వచ్చారు. దీంతో కొంత మందిని మాత్రమే ఆఫీస్ లోపలికి రావడానికి అనుమతిని ఇచ్చారు. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు తాము కూడా వస్తామని లోపలికి చొచ్చుకొని రాగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక కాంగ్రెస్ నాయ‌కురాలు ఎమ్మెల్యే ఆశా కుమారి కొంచెం అతిగా ప్రవర్తించి తనను లోపలికి వెళ్లనివ్వడం లేదని ఓ మ‌హిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకుంది. దీంతో కానిస్టేబుల్ కూడా ఆమె చెంపపై ఒక్కటి ఇవ్వడంతో అల‌జ‌డి రేగింది. పరిస్థితి అదుపు తప్పకముందే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని అందరిని వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

Comments are closed.