Telugu Movie News | Telugu News | Cinema News

ప్ర‌భాస్‌తో దీపిక‌? Deepika with Prabhas?

50

Prabhas-Deepika: ‘బాహుబ‌లి` సిరీస్‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఈ సినిమా వ‌ల్ల ద‌క్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా భారీ మార్కెట్ సంపాదించాడు. ప్ర‌స్తుతం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 150 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న `సాహో` సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 నిజానికి `బాహుబ‌లి-2` షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఓ బాలీవుడ్ సినిమా అంగీక‌రించాన‌ని ప్ర‌భాస్ గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. `సాహో` త‌ర్వాత ఆ సినిమా ప‌ట్టాలెక్కుతోంద‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా ప‌దుకొనే అయితే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ని వార్త‌లు వస్తున్నాయి. దీపిక ఓకే అంటే ఆమెనే తీసుకుందామ‌ని, లేదంటే క‌త్రినాకైఫ్‌, అలియా భ‌ట్‌ల‌లో ఎవ‌రో ఒక‌రిని ఎంచుకుందామ‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments are closed.