Telugu Movie News | Telugu News | Cinema News

మొదటి పోరులోనే డిజాస్టర్

2

మొదటి పోరులోనే డిజాస్టర్

కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు దేశంలో ఎంత పెద్ద పార్టీగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గత ఎన్నికల నుండి పార్టీ రూపు రేఖలు మారడంతో ఎన్నికల రిజల్ట్ లో కూడా చాలా తేడాలు వచ్చాయి.
బలంగా ఉన్న స్థానాలను కూడా బీజేపీ ధాటికి వదులుకోవాల్సి వచ్చింది. అయితే రీసెంట్ గా పార్టీ బాధ్యతలను పూర్తిగా అధిష్టానం రాహుల్ కి అప్పగించారు. రాహుల్ ఎన్ని ప్రచారాలను నిర్వహిస్తోన్న కూడా పోటీని అయితే ఇస్తోంది గాని అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోతోంది. మోడీ పార్టీని గెలిపించే దిశగా ప్రణాలికలతో ముందుకు సాగుతున్నాడు.

రాహుల్ మాత్రం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. అధికారం మాత్రం ఆ పార్టీకి దక్కడం లేదు. అయితే కొన్ని రోజుల క్రితమే సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని రాహుల్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో మళ్లీ అంతర్గత విభేదాలు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ అధ్యక్షుడైన మొదటి పోటీలోనే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఉపాధ్యక్షుడిగా ఉన్నపుడు రాహుల్ అంతగా ప్రభావం ఏమి చూపలేదు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మొదటి పోరులోనే డిజాస్టర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే గుజరాత్ లో మాత్రం రాహుల్ చేసిన ప్రచారానికి మంచి మార్కులే పడ్డాయి. బీజేపీ తో పోటీపడి 80 సీట్లను దక్కించుకుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ మాత్రం ఊహించని విధంగా 21 స్థానాలనే గెలుచుకొని ఓటమిపాలైంది.

Leave A Reply

Your email address will not be published.