Telugu Movie News | Telugu News | Cinema News

పోరాడి ఓడిన కాంగ్రెస్!

2

పోరాడి ఓడిన కాంగ్రెస్

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన గుజరాత్ – హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ లో మోడీ హవానే కొనసాగింది. మొదటివరకు కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చినా కూడా కొన్ని స్థానాలవరకే తన స్టామినాను చూపించింది. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకున్న రెండురోజులకే రిజల్ట్ లో చాలా తేడా వచ్చింది. ఇక భారత జనతా పార్టీ బాధ్యతలను తీసుకున్నప్పటి నుండి మోడీ విజయాన్ని చూస్తున్నాడు. తన రాజకీయ ప్రణాళికలతో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేసేలా చేస్తున్నాడు. అయితే గుజరాత్ లో మాత్రం రాహుల్ ప్రచారం చాలా వరకు క్లిక్ అయ్యిందనే చెప్పాలి. ఓడిపోయినా మోడీ అడ్డాలో కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో పోటీని ఇచ్చింది.

గుజరాత్ లో 182 స్థానాల్లో 150 కి పైగా సీట్లను బీజేపీ దక్కించుకుంటుందని అందరు అనుకున్నారు. ముఖ్యంగా మోడీ కూడా ఛాలెంజ్ చేశాడు. కానీ ఫైనల్ గా 99 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 80 స్థానాలను గెలుచుకొని పరువు నిలబెట్టుకుంది.

ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మొదటి నుంచి బీజేపీకి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నా కూడా కాంగ్రెస్ హస్తం రేజ్ అయ్యింది. కానీ కొద్దీ సేపటికే మళ్లీ డౌన్ అయ్యింది. మొత్తంగా అక్కడ 68 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 44 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్ 21 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్ రెండు రాష్ట్రలో  పరాజయం అందుకోవడంతో ప్రస్తుతం దేశం మొత్తంలో కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయినా కౌంట్ ని పెంచుకొని మళ్లీ దేశాన్ని పాలిస్తుందో లేదో చూడాలి.

 

Leave A Reply

Your email address will not be published.