Telugu Movie News | Telugu News | Cinema News

జిమ్ లో శ్రీదేవి కుమార్తె వర్కౌట్స్

6

జిమ్ లో శ్రీదేవి కుమార్తె వర్కౌట్స్

హీరోయిన్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి తన కూతుళ్లను కూడా అదే తరహాలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతోంది. ముందుగా పెద్ద కుమార్తె జాన్వీ ని హీరోయిన్ గా చేసేందుకు అంతా సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ త్వరలో ధఢఖ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షాహిద్ కపూర్ కజిన్ ఇషాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే మొదటి సినిమా కావడంతో జాన్వీ ఫిట్ నెస్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందంగా కనిపించడానికి జిమ్ వర్కౌట్స్ బాగా చేస్తోంది. రీసెంట్ గా అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అమ్మడికి సోషల్ మీడియాలో లో ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. దీంతో ఆమె సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ధఢఖ్ మరాఠి సైరత్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.