Telugu Movie News | Telugu News | Cinema News

నాగేశ్వర రావు – నాగార్జున – నాగసుశీల

3

నాగేశ్వర రావు – నాగార్జున – నాగసుశీల

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి ఫ్యామిలీ మొత్తం హలో సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ఎవరికీ వారు సినిమా స్థాయిని పెంచేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇకపోతే నాగార్జున అలాగే వారి సోదరి నాగ సుశీల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు. నాగేశ్వర రావు – నాగార్జున – నాగసుశీల అనే పేర్లు ఎలా వచ్చాయి అనే దానిపై నాగ్ వివరణ ఇచ్చాడు. నాగ్ మాట్లాడుతూ.. నాన్న (అక్కినేని నాగేశ్వరరావు) నానమ్మ కడుపులో ఉన్నపుడు ఒక చిన్న నాగుపాము కలలోకి వచ్చిందట. అయితే నాన్న జన్మించిన తర్వాత ఇంకా పేరు పెట్టలేదట. ఒక రోజు పాలు ఇస్తుంటే.. సడన్ గా నాగుపాము మళ్లీ కనిపించడంతో నాగేశ్వరరావు అని పేరు పెట్టారని చెబుతూ.. నాగార్జున – నాగసుశీల – నాగ చైతన్య పేర్లు అలా కంటిన్యూ అయ్యాయని నాగ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.