Telugu Movie News | Telugu News | Cinema News

భయపడి ఒళ్లు తడిపేసుకున్న

28

భయపడి ఒళ్లు తడిపేసుకున్న

ఎంసీఏ’ సక్సెస్‌తో జోరుమీదున్నారు నాని. ఈ ఏడాది వచ్చిన ‘నేను లోకల్‌’, ‘నిన్నుకోరి’, ‘ఎంసీఏ’ వరుసగా హిట్టవడంతో నాని మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’గా తన నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఇలా వివరించారు.అమ్మాయి కోసం తన్నులు తిన్నారటగా?
నాని: అవును. ఆమె నా ఫ్రెండ్‌ సోదరి. కాలేజ్‌లో ఉన్నప్పుడు తనకు ఎవరితోనో సమస్యగా ఉందని చెప్పింది. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఆమె సాయం చేయమని అడగ్గానే హీరోలా ఫీలైపోయి ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేశాను. కానీ కుదరలేదు. ఆమె సమస్య తీరిపోతుందని అనుకున్నాను. కానీ, నాకు పడతాయని అనుకోలేదు. ఇది ఎప్పుడో కాలేజ్‌లో జరిగిన సంఘటన.ఎప్పుడైనా తాగి కారు నడిపారా?
నడిపాను. కానీ లిమిట్‌గానే తాగాను.బెంచీల కింద బబుల్‌గమ్‌ అంటించడం..?
చాలా సార్లు. స్కూల్లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు చేశాను. బ్రేక్‌ సమయంలో నములుతూనే ఉంటాం. సరిగ్గా క్లాస్‌ మొదలయ్యేసరికి గుర్తొచ్చి దొరికిపోతామేమోనని అప్పటికప్పుడు తీసి బెంచీల కింద అంటించేసేవాళ్లం.మర్చిపోయేంతగా ఎప్పుడైనా తాగారా?
లేదు. చిన్న పార్టీ అయినా సరే ఎవరైనా నా స్నేహితులు తాగితే వారి బాధ్యత నాకే అప్పజెప్తారు. ఎందుకంటే వారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాల్సిన బాధ్యత నాపైనే ఉంచేవారు. ఇలా నన్ను కూడా ఎవరన్నా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సాధారణంగా సినిమా విడుదలకి ముందు చాలా కంగారుగా ఉంటుంది. ఆ సమయంలో అన్నీ మర్చిపోయేలాఫుల్‌గా తాగేసి పడుకోవాలని అనిపిస్తుంది. కానీ, అలా చేయలేను కదా!

నాన్న పాకెట్‌ నుంచి డబ్బులు నొక్కేయడం..
నాన్న పాకెట్‌ నుంచి కాదు కానీ అమ్మ దాచిన డబ్బులు కొట్టేసేవాడిని. చిన్నప్పుడు వేసవి సెలవుల సమయంలో ఐస్‌క్రీం బండి వచ్చేది. ఆ ఐస్‌క్రీం ఒక్కోటి రెండు రూపాయలు. అవి తినకూడదు అని అమ్మచెప్తుండేది. కానీ, నేను వినకుండా అమ్మ పర్సు నుంచి రూ.5 కొట్టేశాను. నేను డబ్బు దొంగిలించినందుకు దొరికిపోలేదు. నిజాయతీకి దొరికిపోయాను. ఐస్‌క్రీం రూ.2. నేను తీసుకుంది రూ.5. మిగతా మూడు రూపాయల చిల్లర పర్సులో పెట్టబోతుంటే అమ్మ చూసింది. అలా దొంగతనానికి కాకుండా మంచితనానికి దొరికిపోయాను.

అమ్మానాన్నల సంతకాలు ఫోర్జరీ చేశారా?
చేశా. ఒకటో రెండో సబ్జెక్టులు ఫెయిల్‌ అయివుంటే చేసుండేవాడిని కాదు. కానీ నా రిపోర్ట్‌ కార్డు మరీ దారుణంగా ఉండేది. నా మార్కులు చూసి నాన్న కళ్లు తిరిగి పడిపోతాడేమోనని భయమేసి ఫోర్జరీ చేయడం ట్రై చేశాను. చెప్పాలంటే ఇప్పటికీ నాకు మా నాన్న సంతకం పెట్టడం రాదు.

ఏరోజైనా స్నానం చేయకుండా వెళ్లారా?
42 రోజుల్లో నేను రెండు సార్లు మాత్రమే స్నానం చేశాను. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చిత్రీకరణ కోసం ట్రెక్కింగ్‌కి హిమాలయాలకు వెళ్లాం. మా బృందంలో 33 మంది ఉన్నారు. వారిలో రెండు రోజులు స్నానం చేసిన వాడిని నేనొక్కడినే..(నవ్వుతూ)

పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారా?
తిన్నాను. అది ఓ పెద్ద స్టోరీ. ఎస్సార్‌నగర్‌లో నారాయణ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు పొరపాటుగా నా స్నేహితుడు చేసిన తప్పునకు నాకు దెబ్బలు పడ్డాయి. మరోసారి సత్యం థియేటర్‌లో టికెట్ల కోసం వెళ్లినప్పుడు రద్దీ ఎక్కువగా ఉంది. దాంతో ఒకటే కౌంటర్‌ వద్ద రెండో లైన్లు కట్టేశారు. ఆ రెండో లైన్‌లో నేనూ ఉన్నా. దాంతో అందరితో పాటు నాకూ పడ్డాయి.

మరొకరి ఫోన్‌లు చెక్‌ చేయడం..
లేదు. పొరపాటుగా మరొకరి ఫోన్‌ చూడాల్సి వచ్చిందే కానీ, కావాలని చెక్‌చేయడానికి మాత్రం వేరొకరి ఫోన్‌ ముట్టుకోలేదు.

పరీక్షల్లో కాపీ కొట్టారా?
చాలా సార్లు. ఓసారి కాపీ కొడుతూ దొరికిపోయాను కూడా. అది కూడా పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నప్పుడు షూలో చీటీలు పెట్టుకుని దొరికిపోయాను. చెకింగ్‌ స్వా్కడ్‌కి నేను నచ్చినట్టున్నాను. దాంతో నన్నుడీబార్‌ చేయకుండా వదిలేశారు.

రెస్టారెంట్‌లో ఎప్పుడైనా దొంగతనం చేశారా?
రెస్టారెంట్‌ నుంచి కాదు కానీ, ఓసారి మ్యూజిక్‌ స్టోర్‌ నుంచి దొంగతనం చేశా.

సినిమా బాలేదని థియేటర్‌ నుంచి వాకౌట్‌ చేశారా?
అవును. ఓ పెద్ద స్టార్‌ సినిమా అది. పేరు చెప్పలేను. రెండు మూడు సార్లు ఇలా సినిమా బాగోలేదని వెళ్లిపోయాను.

ప్రాణం కోసం పరుగులు తీసిన క్షణాలు ఉన్నాయా?
ఉంది. ‘ఎంసీఏ’ షూటింగ్‌లోనే జరిగింది. వరంగల్‌లో రైల్వే స్టేషన్‌ రోడ్డు వద్ద చిత్రీకరణ జరపాల్సి ఉంది. అక్కడ చిత్రీకరణ జరుగుతున్నట్లు ఎవ్వరికీ తెలీదు. అందరం వాకీటాకీలతో మాట్లాడుకునేవాళ్లం. నేను ముందు ఆగి ఉన్న కారు నుంచి దిగి జనాల మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి నాకోసం ముందు ఆగి ఉన్న కారులో ఎక్కాల్సిన సన్నివేశం ఒకటి ఉంది. జనాలు ఎక్కువైపోవడంతో నేను ఎక్కాల్సిన కారు ముందుకు వెళ్లిపోయింది. దాంతో నేను పరిగెడుతున్నప్పుడు జనం నన్ను చూసి చుట్టుముట్టేశారు. ఏం చేయాలో అర్థంకాక పక్కనే ఉన్న ఆటోలో ఎక్కేశాను. దాంతో ఆటో డ్రైవర్‌ షాకయ్యాడు. ముందున్న కారుని ఫాలో చేయమని చెప్పి వెళ్లిపోయాను.

భయపడి ఒళ్లు తడిపేసుకున్న సంఘటనలు ఉన్నాయా?
రామ్‌గోపాల్‌ వర్మ ‘దెయ్యం’ సినిమా చూస్తున్నప్పుడు భయమేసి నాకు తెలీకుండానే చేతిలో ఉన్న కోక్‌ని ప్యాంట్‌పై పోసేసుకున్నా. నా ఫ్రెండ్స్‌చూసి భయంతో ప్యాంట్‌ తడుపుకొన్నానని అనుకున్నారు.

Comments are closed.