Telugu Movie News | Telugu News | Cinema News

అభిమానులకు క్షమాపణ చెప్పిన పవన్ – Audio Full songs

2

అభిమానులకు క్షమాపణ చెప్పిన పవన్

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో మాట్లాడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులకు క్షమాపణ చెప్పాడు.
   ‘‘ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద వేదికను ఏర్పాటు చేయలేకపోయాం. హైదరాబాద్ వచ్చినా కార్యక్రమానికి రాలేకపోయిన అభిమానులందరూ నన్ను క్షమించండి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నా హృదయ వైశాల్యం పెద్దది కానీ.. శరీరం చిన్నదే. ఇక్కడ ఉన్నవారే కాదు.. టీవీల ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పత్రీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అసలు నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత మంది ఫ్యాన్స్ దొరుకుతారు అనుకోలేదు. కానీ మీరందరూ దొరికారు. దానికి కారణమైన సినిమాకు పాదాభివందనం చేస్తున్నాను’’ అంటూ పవన్ కొంత ఉద్వేగంగా మాట్లాడాడు.

 

Comments are closed.