Telugu Movie News | Telugu News | Cinema News

విమర్శకులకు పవన్ కౌంటర్..

72

విమర్శకులకు పవన్ కౌంటర్..

జనసేన అధ్యక్షుడు పవన్ కకళ్యాణ్ ప్రస్తుత తెలుగు రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. తనవరకు వచ్చిన సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాడు. ఇకపోతే ఇటీవల ఆయనపై వస్తోన్న విమర్శలకు ఆయన ఎక్కువగా స్పందించడం లేదు. ముఖ్యంగా క్రిటిక్ అని చెప్పుకుంటు కత్తి మహేష్ పవన్ పై కొన్ని విమర్శలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ఎప్పుడు కత్తి మహేష్ విమర్శలకు ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వలేదు కానీ ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా అతని విమర్శలకు కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ గా పవన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేయడం చాలా వైరల్ అయ్యింది. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. అంటూ పవన్ కి ఒక జర్నలిస్ట్ పంపిన మెసేజ్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ విషయంపై కత్తి మహేష్ వెంటనే స్పందించాడు. ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా…అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!. అంటూ ట్వీట్ చేశాడు.

Comments are closed.