Telugu Movie News | Telugu News | Cinema News

అజ్ఞాతవాసి పెయిడ్ ప్రీమియర్ షోలు

33

అజ్ఞాతవాసి పెయిడ్ ప్రీమియర్ షోలు

పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వీలైనంత ఎక్కువగా డబ్బుగా మార్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు సిద్ధం అయిపోతున్నాయి. అన్ని ఏరియాలలో అజ్ఞాతవాసి పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధం అవుతున్నారు. పవన్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పెయిడ్ ప్రీమియర్స్( బెనిఫిట్ షోలు) నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా పవన్ కు బలమైన మార్కెట్ ఉన్న నైజాం ఏరియాలో వీలైనన్ని ఎక్కువ ప్రీమియర్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అజ్ఞాతవాసి నైజాం ఏరియా హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజుకు నైజాం ఏరియాలో థియేటర్ లపై మంచి పట్టు ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ ప్రీమియర్స్ కు అనుమతులు తీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఇక ఈ ప్రీమియర్స్ లో టికెట్ ధర ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణ టికెట్ రేటు కంటే 20 రెట్లు ఎక్కువగా ప్రీమియర్స్ టికెట్ ధర ఉండనుంది. ప్రీమియర్స్ లో అజ్ఞాతవాసి సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటున్న పవన్ అభిమానులకు ఇది షాకే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఈ రకమైన అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇంకా మేజర్ ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలు పెట్టలేదు. థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాక ఈ అంచనాలు మరో లెవల్ చేరుకోవడం ఖాయం అని పవన్ ఫాన్స్ అంటున్నారు.

Comments are closed.