Telugu Movie News | Telugu News | Cinema News

పవన్ పై ఎమ్మెల్యే అనిత..!

6

పవన్ పై ఎమ్మెల్యే అనిత..!

 

పవన్ కళ్యాణ్ ఎంచుకున్న కాన్సెప్ట్ అదుర్స్ అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెల్ళడం, ఆ దిశగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అనిత అన్నారు. వాటిని ఎవరూ తప్పు పట్టలేరని ఆమె తెలిపారు. అలా చేయడం మంచిదే అని అన్నారు. ప్రశ్నించే హక్కు రాజకీయ నాయకుడిగా పవన్ కు ఉందని వ్యాఖ్యానించారు. కానీ మును ముందు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలని అన్నారు.

ఏపీలో ప్రతిపక్షం తన రోల్ మరచి గోల్ సెట్ చేసుకుందని ఆమె ఎద్దేవా చేసారు. జగన్ ముఖ్యమంత్రి కావడమే వైసిపి వాళ్ళ గోల్ అని అనిత అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యని చంద్రబాబుకు వివరించిన వెంటనే దానిపై తగు చర్యలు తీసుకున్నారని గుర్తు చేసారు. జనసేన, టీడీపీ పొత్తు విషయం కాలమే నిర్ణయిస్తుందని అనిత తెలపడం విశేషం.

రాజకీయాలంటే ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి. ప్రజలకు మంచి చేద్దామని వచ్చినా నాయకులను కూడా రాజకీయ పరిస్థితులు చాలా మార్చేస్తాయి. ఒక వేళ వారు మారకుంటే వారిని అణగదొక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కాలం ఎంత మారుతున్నా మన దేశంలో ఇంకా రాజకీయ ప్రణాలికలు మారలేదని చెప్పాలి. నాయకులు వస్తున్నారు పోతున్నారు. పాలన కన్నా కాంట్రవర్సీలలో స్కామ్ లలోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొన్ని మంచి పనులు చేస్తున్నా కూడా అందులో ఎదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. మొత్తానికి ఎదో ఒక మంచి జరిగిందని ఆనందపడే సమయానికి మరో సైడ్ నుంచి మరొక కొత్త సమస్య.

అది ప్రజల నుంచి రాదు. ఏ ప్రతి పక్షం నుండో రాజకీయ శత్రువుల నుండో మంచి నాయకులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక యువత రాజకీయాల్లోకి రావడం అన్నది మిస్టరీ ఫార్ములా అని చెప్పాలి. పోనీ మంచి చేయాలనీ వచ్చే కొందరు ప్రముఖులు కూడా రాజకీయ రణరంగంలో చిక్కుకొని సతమతమవుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై చాలా మంది కళ్లు పడ్డాయని తెలుస్తోంది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ తో గెలవడమంటే కొంచెం కష్టమనే చెప్పాలి. పార్టీలో సీనియర్ నాయకులూ ఎవరు లేరు, పవన్ కి కూడా అసలు రాజకీయ పన్నాగాలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ తాను మాత్రం ఒక దారిలో కొత్తగా నడవాలని అనుకుంటున్నాడు. అతని వ్యక్తిగతం ఏమిటన్నది తర్వాత సంగతి. కానీ ఎటువంటి అండ లేకుండా ప్రయత్నాలు చేయడం అన్నది చాలా గొప్ప విషయం.

ఈ మధ్య కాలంలో పవన్ జరిపిన మీటింగ్ లకు ఆదరణ బాగానే వచ్చింది. తెలంగాణాలో అతని ప్రభావం ఉంటుందో ఉండదో చెప్పడం చాలా కష్టం కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తప్పకుండా ఉంటుంది. అన్నదిరాజకీయ విశ్లేషకుల భావన. కానీ పవన్ వైపు ఇప్పుడు డేగ కళ్లతో విషం చిమ్మే నాగు పాములాంటి నాయకులూ చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. పవన్ ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు అన్నది తరువాత సంగతి కానీ అతనిపై మాత్రం కుట్రలు జరుగుతున్నాయన్నది మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రధాన పార్టీల మధ్య పోటీ బాగానే ఉంది. అయితే జనసేన మధ్యలో ఎంతో కొంత ప్రభావం చూపి వారికి అధికారం దక్కకుండా చేసే అవకాశం కూడా ఉంది.

దీంతో పవన్ రాజకీయ భవిష్యత్తుపై ఆ ప్రధాన పార్టీలు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే పవన్ కి కొన్ని జిల్లాల్లో అభిమాన సంఘాలు తారా స్థాయిలో ఉన్నాయి. వారు ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ మరి పవన్ కళ్యాణ్ పై అనవసరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడితే వారికే నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. అందుకే కొంత మంది ప్రధాన నాయకులు పవన్ పై ఎలాంటి కామెంట్స్ చేయకుండా వారిపని వారు చేసుకుంటున్నారు.

ఇక ఎటువంటి గుర్తింపు లేని వారు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ వారి హోదాను పెంచుకునుటున్నారు. అందులో కూడా రాజకీయ కుట్రలు లేకపోలేవు అన్నిది కూడా స్పష్టమవుతోంది. కానీ పవన్ తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎలాంటి కామెంట్స్ చేసినా తన దారిని మాత్రం మార్చడం లేదు. రాజకీయాల్లో డైరెక్ట్ గా ఎదుర్కోవడం అన్నది అంత సాధారణమైన విషయం కాదు కానీ పవన్ వెనకాల ఎన్ని పన్నాగాలు వెంటాడుతున్నా తాను మాత్రం ఎదురుగా ఉండే పోరాడతాను అంటున్నాడు. మరి ఆ ధైర్యంతో పవన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి!

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.