Telugu Movie News | Telugu News | Cinema News

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు తొలిసారి ఆంధ్రప్రేదేశ్ లో

16

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు తొలిసారి ఆంధ్రప్రేదేశ్ లో పర్యటిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 9 : 30 గంటలకు రాష్ట్రపతి దంపతులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంటారు. కాగా మంత్రి అఖిల ప్రియ రాష్ట్రపతి సతీమణి సవిత కోవింద్ కు స్వాగతం పలికి విజయవాడ స్వరాజ్య మైదానంలో గులాబీ ప్రదర్సనకు తీసుకుని వెళతారు.

రాష్ట్ర పతి దంపతుల పర్యటన ముగిసేవరకు మంత్రి అఖిల ప్రియ సవిత కోవింద్ తోనే ఉండనున్నారు. కాగా సవితాకోవింద్ ను ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతి దంపతుల పర్యటన కోసం అధికారులు అన్ని భద్రతా ఏర్పాట్లని సమీక్షించనున్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని గురించి రాష్ట్రపతికి ప్రజెంటేషన్ కూడా ఇవ్వనుంది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు తొలిసారి ఆంధ్రప్రేదేశ్ లో పర్యటిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 9 : 30 గంటలకు రాష్ట్రపతి దంపతులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాగార్జున యూనివర్సిటీకి చేరుకుంటారు. కాగా మంత్రి అఖిల ప్రియ రాష్ట్రపతి సతీమణి సవిత కోవింద్ కు స్వాగతం పలికి విజయవాడ స్వరాజ్య మైదానంలో గులాబీ ప్రదర్సనకు తీసుకుని వెళతారు.

Comments are closed.