Telugu Movie News | Telugu News | Cinema News

రానా కొత్త ప్రయోగం .. దర్శకుడు బాలతో సినిమా ?

14

రానా కొత్త ప్రయోగం .. దర్శకుడు బాలతో సినిమా ?

టాలీవుడ్ హీరో రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాహుబలి తరువాత రానా అటు కోలీవుడ్ తో పాటు ఇటు బాలీవుడ్ లోకూడా దూసుకుపోతున్నాడు. సోలో హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న అయన తాజాగా మరో ప్రయోగాత్మక సినిమాకు సిద్ధం అయ్యాడు. అయితే ఈ సారి అయన సినిమాకు కమిట్ అయినా దర్శకుడు ఎవరో తెలుసా .. బాల ? జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న బాల సినిమాలో వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. పైగా అయన సినిమాల్లో హీరోలు బిన్నంగా ఉంటారు. తాజాగా బాల చెప్పిన ఓ కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రానా ఓకే చెప్పాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, ఇందులో హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాధ్ ను ఎంపిక చేశారట. మరి ఈ సినిమాలో రానా ఎలా కనిపిస్తాడా అన్న ఆసక్తి అప్పుడే అందరిలో మొదలైంది.

Comments are closed.