Telugu Movie News | Telugu News | Cinema News

మెగా ఫ్యామిలీ కోసం ‘అజ్ఞాతవాసి’ స్క్రీనింగ్‌?

26

మెగా ఫ్యామిలీ కోసం ‘అజ్ఞాతవాసి’ స్క్రీనింగ్‌?

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని, జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. అయితే మెగా కుటుంబం కోసం సినిమా విడుదలయ్యే రెండు రోజుల ముందు ‘అజ్ఞాతవాసి’ ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దాంతో మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమా చూశాక ఆయన స్పందన ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళీ శర్మ సహాయ పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Comments are closed.