Telugu Movie News | Telugu News | Cinema News

‘టచ్‌ చేసి చూడు’ ఫస్ట్‌లుక్‌ విడుదల | Touch Chesi Chudu First look | Ravi Teja

17

మాస్‌మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్‌, వల్లభనేని వంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరోపక్క రవితేజ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకి ‘నేల టికెట్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారట.

Comments are closed.