ఐశ్వర్యా లక్ష్మి.. ఇప్పుడీ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఓటీటీలో ‘అమ్ము’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి( Aishwarya Lekshmi) ని మర్చిపోవడం అంత సులువేమీ కాదు.
‘అమ్ము’ పాత్రలో అంతలా నటించేసింది ఈ నటి. కాదు, కాదు జీవించేసింది. ఆ నటి పేరే ఐశ్వర్యా లక్ష్మి. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ అంతా ఈ ముద్దుగుమ్మ గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఆ తర్వాత ‘పొన్నియన్ సెల్వన్ 1’లో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించి ఇంకా గుర్తుండి పోయింది. మలయాళ నటి. మలయాళంలో బోలెడన్ని సినిమాలు చేసిన అనుభవం వుంది ఐశ్వర్య లక్ష్మికి.
Aishwarya Lekshmi.. నటి కాకుంటే ఏమయ్యుండేది.!
డాక్టర్ అయ్యుండేది. అయ్యుండడమేంటీ.? డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది ఈ అందాల అభినయ నటి. అవునండీ ఎమ్బిబియస్ పూర్తి చేసిన ఐశ్వర్యా లక్ష్మికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అట. చదువుకునే రోజుల్లోనే యాక్టింగ్ వైపు ఆకర్షితురాలైంది

కానీ, ఇంట్లోని వాళ్లు చదువు ముఖ్యం అనేసరికి డాక్టర్ డిగ్రీ పొంది, ఆ తర్వాత యాక్టింగ్ వైపు వచ్చేసింది అందాల ఐశ్వర్య లక్ష్మి.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాదిరి ఐశ్వర్య లక్ష్మి కూడా నేచురల్ బ్యూటీనే. అందంతో పాటూ, అభినయం విషయానికి వచ్చేసరికి ఎక్కడెక్కడో కోసేసుకుంటుందంతే, తెరపై ఆమెను చూశాకా, ఆడియన్స్ ఇంకెక్కడో కోసేసుకోవాలంతే.!
బోలెడన్ని మలయాళ సినిమాల్లో నటించిన అనుభవం వున్న ఐశ్వర్య లక్ష్మి, తెలుగులో ‘గాడ్ సే’ సినిమాలో నటించింది. త్వరలో మరిన్ని తెలుగు ప్రాజెక్టెలు టేకప్ చేసే దిశగా ఎట్రాక్ట్ చేస్తోంది.