All New Ambassador Car.. ఒకప్పుడు కారు అంటే, అంబాసిడర్ మాత్రమే. ఎందరో రాజకీయ ప్రముఖులకు దర్పం తెచ్చి పెట్టిన కారు అది. అంబాసిడర్ కారులో తిరగడం అంటే, అదొక సోషల్ స్టేటస్.
మార్కెట్లోకి ఎన్ని కొత్త కార్లు వచ్చినా, ఎన్ని కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను దించినా అంబాసిడర్ కారు చాలా ఏళ్ల పాటు తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వచ్చింది.
సుమారు 60 ఏళ్ల పాటు అంబాసిడర్ కారు మన దేశంలో హల్చల్ చేసింది. ఇంకా ఆ కార్లు మన రోడ్ల మీద అడపా దడపా కనిపిస్తూనే వుంటాయ్. చివరి సారిగా 2014లో అంబాసిడర్ కార్ల వుత్పత్తి ఆగిపోయింది.
పవర్ స్టీరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచినా, ఎందుకో కొత్త తరానికి అంబాసిడర్ కారు అంతగా నచ్చకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
All New Ambassador Car.. ఈసారి ఇంకా కొత్తగా.!
మళ్లీ రోడ్లపై అంబాసిడర్ కారు సగర్వంగా తలెత్తుకు తిరిగే పరిస్థితులు రాబోతున్నాయ్. ఈసారి సంప్రదాయ ఇంధనాలతో కాకుండా బ్యాటరీతో నడిచేలా అంబాసిడర్ కారును రూపొందించారు. మన భారత మార్కెట్లోకి ఆ కారు వచ్చే ఏడాది చివరినాటికి రావచ్చు.
కారు మోడల్ అయితే, అందర్నీ కట్టిపడేస్తోంది. ఇండియాలో లాంఛ్ చేస్తే వందలు, వేలల్లో కాదు.. లక్షల్లో ప్రీ బుకింగ్స్ జరిగేలా వుంది పరిస్థితి. హై అండ్ లగ్జరీ కార్లకు ధీటుగా సరికొత్త అంబాసిడర్ రూపొందింది.
ఒకప్పుడు అంబాసిడర్ కారు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అప్పటికి అదే హై అండ్ మోడల్.
దశాబ్ధాల పాటు అంబాసిడర్ కారు షేప్, డిజైన్ మారకపోవడానికి కారణం ఆ అంబాసిడర్ మీద జనానికి వున్న క్రేజ్ మాత్రమే. అయితే, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా.
ఏడాదికో, రెండేళ్లకో డిజైన్ మార్చకపోతే ఏ కారూ, మనుగడ సాగించలేదు. మరి అంబాసిడర్ పరిస్థితి ఇప్పుడు కూడా ఏమవుతుందో.