Anveshi Jain.. బాలీవుడ్ నటి కృతి సనన్ కొన్నాళ్ళ క్రితం ఏ మహిళా ఎదుర్కోకూడని విమర్శని, తోటి నటి ద్వారా ఎదుర్కొంది. ‘హెడ్ లైట్స్ లేవు.. బంపర్ కూడా లేదు..’ అంటూ ఓ నటి, కృతి సనన్ మీద వెటకారం చేసింది.
హెడ్ లైట్స్ అంటే, ఎద భాగం అనీ.. బంపర్ అంటే, బ్యాక్ పార్ట్ అనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి, ఇలాంటి సమస్యే, మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనె కూడా ఎదుర్కొంది.
ఈ ‘ఎద’ విమర్శల మేధోన్మధనమేంటో.!
‘ఔను, నేను ఆడదాన్ని.. నాకు యెద భాగం ఎత్తుగా వుంటుంది.. కానీ, మరీ ఎక్కువగా లేవవి.. అది నా తప్పు కాదు..’ అంటూ దీపికా పడుకొనే నిర్మొహమాటంగా తన మీద వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.
మరి, అన్వేషి జైన్ పరిస్థితేంటి.? ఆమెది నిజానికి, చాలా చిత్రమైన, ఒకింత బాధాకరమైన పరిస్థితి. తెలుగు సినీ నటి రాశి కూడా ఒకప్పుడు ఇలాంటి సమస్యే ఎదుర్కొంది.
అన్వేషి జైన్ పరిస్థితి మరీ దారుణం. వయసు వచ్చాక, విద్యనభ్యసిస్తున్న సమయంలో.. శరీరంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చాలా బాధపడిందట.
New Song 😍 #anveshijain pic.twitter.com/Gu5LOpylkX
— Anveshi Jain (@IamAnveshi) July 4, 2022
హార్మోనల్ సమస్య కారణంగా ఆమె ఎద భాగంలో గడ్డలు ఏర్పడ్డాయట. దాంతో సహజ స్థితిని మించి అదనంగా ఆమె ఎద భాగం పెరిగిపోయిందట. ఆ సమస్య కారణంగానే అన్వేషి ఎవరితోనూ కలవలేకపోయేదట.

Anveshi Jain.. నయం కాని వ్యాధితో అన్వేషి జైన్..
క్యాన్సర్ అనుకుని వైద్యుని సంప్రదించగా, అది ఓ రకమైన హార్మోనల్ సమస్య, దానికి మందు లేదు, చికిత్స లేదు.. అని చెప్పారట. దాంతో, మానసికంగా కుంగిపోయిందట అన్వేషి జైన్. అయితే, అది నయం చేయగలిగే సమస్య కాకపోయినప్పటికీ, ప్రమాదకరమైన సమస్య అసలే కాదని వైద్యులు సూచించడంతో అన్వేషి జైన్ ఒకింత ఊరట పొందిందట.
తాజాగా ఈ విషయాన్ని అన్వేషి జైన్ వెల్లడించింది. తనకున్న లోపాన్నే కెరీర్‌కి బంగారు బాటగా మలచుకున్న అన్వేషి జైన్, ఇలాంటి సమస్యతో బాధపడేవారికి నిజంగా ఓ ఇన్సిప్రేషన్ అని చెప్పకుండా వుండలేం.
సోషల్ మీడియాలో ఇప్పుడు అన్వేషి జైన్ ఓ సెన్సేషన్. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన అన్వేషి, తాజాగా తెలుగు తెరపైనా అడుగు పెట్టింది. రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ‘సీసా..’ అంటూ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడీ స్పెషల్ సాంగ్ ఓ ట్రెండ్ సృష్టిస్తోంది టాలీవుడ్లో.