Bigg Boss Telugu 6 Neha Chowdary
వార్తలు

Bigg Boss Neha Chowdary.. పెళ్లి నుంచి తప్పించుకోవడానికే నేహా చౌదరి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిందా.?

బిగ్‌బాస్ హౌస్‌లో వున్న రియల్ కపుల్ మెరీనా రోహిత్ రొమాన్స్ సీన్స్ చూసి, అర్జెంటుగా నేను హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకుంటాను.. అని ఓ సందర్భంలో నేహా చౌదరి (Bigg Boss Neha) ఫన్నీగా చెప్పింది.

కానీ నిజానికి నేహా చౌదరి పెళ్లి నుంచి తప్పించుకోవడానికే బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లిందంటూ ఆమె హౌస్‌లో వున్నప్పడు చెప్పిన కొన్ని విషయాలు బయటికి అలా కన్‌వే అయ్యాయ్.

Bigg Boss Neha Chowdary.. తూచ్.! అంతా వుత్తదే. అసలు నిజమిదే.!

ఆ మాటలపై నేహా చౌదరి తాజాగా క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదనీ, అంతకు ముందు నుంచే తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ, పెళ్లికి తాను కూడా రెడీగా వున్నానని నేహా చౌదరి చెప్పింది.

Bigg Boss Telugu 6 Neha Chowdary
Bigg Boss Telugu 6 Neha Chowdary

అయితే ఆ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలోనే తనకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందట. పెళ్లి తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లితే, రకరకాలుగా వుంటుందనీ, అత్తింటి వాళ్ల అబ్జెక్షన్స్ గట్రా వుంటాయనీ, అందుకే పెళ్లికి ముందే వెళితే బాగుంటుంది కదా. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుందట నేహా చౌదరి.

కానీ, ఈ పుకారు బయటికి ఎలా వచ్చిందో ఏమో కానీ, పెళ్లి నుంచి తప్పించుకోవడానికే నేను బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లాను.. అంటూ రాంగ్‌గా కన్‌వే అయ్యిందని నేహా చౌదరి వాపోయింది.

ఇంతకీ నేహా చౌదరికి కాబోయే వరుడెలా వుండాలంటే.!

ఆరడుగుల అందగాడై వుండాలట. వెల్ సెటిల్డ్ అయ్యుండాలట. పెళ్లి తర్వాత తన కెరీర్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటోందట. అందుకే వెల్ సెటిల్డ్ వరుడు కావాలంటోంది నేహా చౌదరి.

అంతేకాదు, తనకు హై హీల్స్ అంటే ఇష్టమట. అందుకే తన హైటుకి మ్యాచ్ చేసే మంచి హైటున్న వరుడు కావాలంటోంది. అన్నట్లు వంట బాగా చేసేవాడే వరుడుగా కావాలని క్యూట్ క్యూట్‌గా చెపేస్తోంది అందాల నేహా చౌదరి.

Related posts

కొత్త పెళ్లికూతుళ్లు: ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా.?

admin

తాను బీజేపీ మనిషిని అని అంతలా డప్పు కొట్టి చెప్పడమెందుకట.!

admin

స్పూర్తి కెరటం: సిసలైన విజేత మిథాలీ రాజ్.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More