Anupama Parameswaran Butterfly
సైన్మా

Butterfly Review

అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘బటర్ ఫ్లై’ (Butterfly Review). లేటెస్ట్‌గా ఓటీటీలో రిలీజైంది ఈ చిత్రం. బటర్‌ఫ్లై అంటే అందరికీ చాలా ఇష్టం. చూసేందుకు చాలా అందంగా వుంటుంది.

అందుకే ఈ సినిమాని చూసేందుకు ఓటీటీ జనం ఒకింత ఆసక్తి చూపించారు. అందులోనూ అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య హిట్టు మీద హిట్టు కొట్టి ఫుల్ ఫామ్‌లో వుండడంతో, ఆమె లీడ్ రోల్ మూవీ అంటే ఆ మాత్రం క్యూరియాసిటీ వుంటుంది మరి.

కట్ చేస్తే, సినిమా స్టార్టయ్యింది. చూస్తున్నారు ఆడియన్స్. చెల్లెలిని తల్లిలా ప్రేమించే అక్క పాత్ర. ఆ పాత్ర పోషించింది భూమిక. అక్క చెల్లెలి అనుబంధం గొప్పగా చెప్పడంతోనే కథ మొదలవుతుంది.

Butterfly Review..అక్క చెల్లెలి అనుబంధం.!

ఆ అక్కకి ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలూ, చెల్లెలు.. వీళ్లే ఆ అక్క ప్రపంచం. చెల్లెలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని భర్తకు విడాకులిచ్చేస్తుంది. ఆ కేసు కోర్టులో విచారణలో వుంటుంది.

ఫేమస్ క్రిమినల్ లాయర్ అయిన భూమిక, జడ్జిగా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసం ఢిల్లీ వెళుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొమ్మని చెల్లికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది.

అలా వెళ్లిన అక్క అనుకోకుండా గుండె పోటుకు గురై, ఆసుపత్రిలో చేరుతుంది. చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేని చెల్లెలికి ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంది.

కట్ చేస్తే, ఇక్కడ అక్క పిల్లలు కిడ్నాప్‌కి గురవుతారు. ఆ పిల్లల్ని కాపాడుకునేందుకు అనుపమ ఏం చేసింది.? అసలు ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసిందెవరు.? అనేదే మిగిలిన కథ.

అనుపమ ఆ తప్పు ఎందుకు చేసిందబ్బా.!

కథలో పెద్దగా సస్పెన్స్ ఏమీ లేదు. నడిపించిన తీరూ థ్రిల్లింగ్‌గా లేదూ. రిపీట్ రిపీట్ రిపీట్ సీన్స్‌తో ఆడియన్స్‌ సహనానికి పరీక్ష పెట్టేశారు.

ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించిన భూమిక పాత్రను అక్కడే పడుకోబెట్టేశారు. సింగిల్ కాస్ట్యూమ్‌తో హీరోయిన్‌ని పరుగులు పెట్టించిన వైనం.. దాంతో, సినిమా చూస్తున్నంత సేపూ టార్చర్‌లా ఫీలయ్యారు వీక్షకులు.

అసలెందుకు ఒప్పుకుందా అనుపమ ఇలాంటి సినిమాని అని ఒకానొక టైమ్‌లో తిట్టుకున్నారు కూడా. ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి మంచి కంటెంట్ వున్న సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన అనుపమకి, ‘బటర్‌ఫ్లై’‌తో భారీగా దెబ్బ పడిందనే చెప్పొచ్చు.

Related posts

‘ఎఫ్ 3’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. గ్లామర్ ఫెస్టివల్.!

admin

Adah Sharma.. ‘ఆద’ మరిచిన సోయగం.!

admin

నిత్యా మీనన్ పెళ్లంట.! వరుడు ఎవరంటే.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More