తండ్రికి తగ్గ తనయుడు అంటే, రామ్ చరణ్ అని అస్సలు ఆలోచించకుండా చెప్పేయొచ్చు. మొన్నేమో తండ్రి మెగాస్టార్ ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ’ అంటూ అరుదైన అవార్డు దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు.. దేశ ప్రధాన మంత్రి స్వయానా నరేంద్ర మోడీతో సహా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఇప్పుడు చిరు తనయుడు రామ్ చరణ్.. తానేం తక్కువ కాదంటూ, ‘ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ అనే అరుదైన పురస్కారాన్ని అందుకుని చిరంజీవికి ఆకాశమంత ఆనందాన్ని పంచిచ్చాడు.
Mega Power Star Ram Charan.. ఈ తండ్రీ కొడుకులు సామాన్యులు కారు సుమా.!
ప్రముఖ జాతీయ మీడియా NDTV అందించే అరుదైన ఈ పురస్కారాన్ని రామ్ చరణ్ అందుకున్నాడు.
ఇంతటి అరుదైన పురస్కారం దక్కించుకున్నందుకు చరణ్‌ని చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నా.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మరోవైపు చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కనీ వినీ ఎరుగని రీతిలో దేశ విదేశాల్లో సైతం ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంటున్నాడు రామ్ చరణ్.
కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ తండ్రితో విలక్షణ చిత్రాలు రూపొందిస్తున్నాడు చరణ్. హీరోగా ఇటు సౌత్‌లోనూ అటు నార్త్‌లోనూ కూడా విపరీతమైన క్రేజ్ దక్కించుకోవడంతో పాటూ సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణిస్తున్న రామ్ చరణ్ నిజంగా ‘మగధీరుడే’.