సినిమా.. అంటే ఒకప్పటి పరిస్థితులు వేరు. అగ్ర హీరోలు (Chiranjeevi, Bala Krishna) సైతం, ఏడాదికి నాలుగైదు సినిమాలు.. ఒక్కోసారి పది సినిమాలు కూడా చేసేసేవారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు.!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇదే పరిస్థితిని చూస్తున్నాం. ఏడాదికి ఓ సినిమా చేయడం కూడా గగనమైపోతోంది అగ్ర హీరోలకి. కథల ఎంపిక దగ్గర్నుంచి, బడ్జెట్ అలాగే కాంబినేషన్.. ఇలా చాలా లెక్కలేసుకుంటున్నారు.
కానీ, మంచి నటులనదగ్గరవారు మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలు.. అంతకు మించి చేసేస్తున్నారు. ‘నటుడి’కి కథలు దొరుకుతున్నాయ్. స్టార్ హీరోలకే దొరకడంలేదు.
Chiranjeevi, Bala Krishna.. ఏడాదికి రెండు..
స్టార్ హీరోల్ని మూడు నాలుగు నెలలకోసారి థియేటర్లలో చూసే అవకాశం దొరికితే, ప్రేక్షకులకీ బోర్ కొట్టేస్తుందన్న వాదనా లేకపోలేదు. అందులోనూ కొంత నిజం వుంది.
అయినాగానీ, ఏడాదికి రెండు సినిమాలు చేయొచ్చు స్టార్ హీరోలనదగ్గవారు. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే, మార్కెట్ వ్యూహాలు.. ఇతరత్రా వ్యవహారాలతో కాలయాపన జరుగుతోంది.
ఒక సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టడం తప్పు కాదుగానీ, ఇంతా చేసి ఆ సినిమా తేడా కొడితే.. ఓ ఏడాది మిస్ అవుతోంది స్టార్ హీరోల డైరీ నుంచి. అభిమానులూ ఈ విషయమై ఆందోళన చెందుతున్నారు.