Deepthi Sunaina.. బిగ్ బాస్ ఇంట్లో క్యూటు క్యుటు బొమ్మలా సందడి చేసి, తక్కువ రోజులకే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన దీప్తి సునయన, యూ ట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమాలోని ‘రంగమ్మా.. మంగమ్మా..’ అంటూ సాగే పాటకి, తనదైన స్టయిల్లో డాన్సులేసి, ఆ వీడియో ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది దీప్తి సునయన.

వీటన్నిటికంటే మిన్నగా, షన్నూ గర్ల్ ఫ్రెండ్.. అనే ట్యాగ్ కారణంగా దీప్తి సునయన బోల్డంత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, బిగ్ బాస్ కారణంగా దీప్తి – షన్నూ విడిపోయారు.
Deepthi Sunaina.. అందంగా లేనా.? అస్సలేం బాలేనా.?
‘మీరిద్దరూ మళ్ళీ కలిసిపోవచ్చు కదా..’ అంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు ఇరువురికీ సూచిస్తుంటారు. కానీ, ఎవరి దారి వారిదే.! దీప్తి ప్రస్తుతం పలు యూ ట్యూబ్ వీడియోలతో బిజీగా వుంది. షన్నూ కూడా అలాంటి పనుల్లోనే బిజీగా వున్నాడు.
షన్నూ సంగతి పక్కన పెడితే, ఈ మధ్య మరింత హాట్‌గా చెలరేగిపోతోంది దీప్తి పలు ఫొటో షూట్లతో. అలా తాజా ఫొటో షూట్ ఒకటి దీప్తి సునయన పేరు మార్మోగేలా చేస్తోంది. స్కిన్ కలర్‌ని డామినేట్ చేసేలా వున్న ఈ కాస్ట్యూమ్.. దీప్తి సునయనకి సరికొత్త గ్లామర్ అద్దిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.!
బుంగ మూతి పెట్టి.. అందంగా లేనా.? అస్సలేమీ బాగాలేనా.? అని ప్రశ్నిస్తున్నట్టుంది కదూ.!