Divya Vani Telugu Desam Party దివ్యవాణి. అలనాటి మేటి నటీమణుల్లో ఈమె ఒకరు. బాపు రూపొందించిన ‘పెళ్లి పుస్తకం’ సినిమాకి దివ్యవాణి అందం ఓ ప్లస్ పాయింట్. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి జంటగా తెరకెక్కిన ఈ సినిమాలోని పెళ్లి పాట ఎవ్వర్ గ్రీన్. ఈ పాట లేకుండా, ఏ పెళ్లి వీడియో వుండదంటే అతిశయోక్తి కాదేమో.
అయితే, ఇప్పుడు మన చర్చ ఈ పాటా కాదూ, ‘పెళ్లి పుస్తకం’ సినిమా అంతకన్నా కాదు. బాపు బొమ్మ దివ్యవాణి. ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి చాలా కాలమే అయ్యిందనుకోండి. ప్రస్తుతం రాజకీయాల్లో సత్తా చాటుతోంది. టీడీపీ పార్టీ తరపున మహిళా కార్యకర్తగా తన గొంతుకను గట్టిగా వినిపిస్తూ రాజకీయంలో తనదైన టాలెంట్ చూపిస్తోంది.
అంతా బాగానే వుందిగా. ఇప్పుడేమైంది.? అనుకుంటున్నారా.? టీడీపీలో దివ్యవాణికి ఘోరమైన అన్యాయం జరిగింది. మహానాడు సందర్భంగా తెలుగు దేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు, ఉత్సవాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో సాటి మహిళా నేతగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ గగ్గోలు పెడుతోంది దివ్యవాణి.
దివ్యవాణి అందుకు అర్హురాలు కాదా.?
తెలుగు మహిళా అధ్యక్షురాలు కావడానికి తనకేం తక్కువ.? మంచి వాగ్ధాటి.. ప్రతిపక్షాలను గట్టిగా ప్రశ్నించగల, విమర్శించగల సత్తా వున్నదాన్ని కదా.. తనను ఎందుకు చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ వాపోతోంది దివ్యవాణి. పాపం ఏడుపొక్కటే తక్కువ దివ్యవాణికి.

సినీ గ్లామర్‌ని వాడేసుకోవడంలో చంద్రబాబు ధిట్ట. గతంలో జయప్రద, రోజా తదితర సినీ ముద్దుగుమ్మల గ్లామర్‌ని అలాగే వాడుకున్నారు. అవసరం తీరిపోయాక వదిలేశారు. వేరే దారి లేక, ఆయా ముద్దుగుమ్మలు వేర్వేరు దారుల్లో తమ సత్తా చూపిస్తున్నారు.
దివ్యవాణికి జ్ఞానోదయం..
ఇప్పుడు దివ్యవాణి పరిస్థితి కూడా అంతేనేమో. తెలుగుదేశం పార్టీ కోసం చివరి వరకూ తన టాకింగ్ టాలెంట్‌ని ఉపయోగించిన రోజా, చిట్ట చివరికి వైసీపీలో చేరిపోయింది. వైసీపీలో తనకు న్యాయం జరిగింది. రీసెంట్‌గా మినిస్టర్ పదవిని దక్కించుకుని చిరకాల కోరిక నెరవేర్చుకుంది రోజా.
ఎంత కాలం తెలుగుదేశంలో వున్నా తనకు తగిన గౌరవం దక్కలేదని గతంలో రోజా కూడా చాలా సార్లు బాధపడింది. ఇప్పుడు అదే పరిస్థితి దివ్యవాణి ఫేస్ చేయాల్సి వస్తోంది. తాజా అంశాన్ని బట్టి, దివ్యవాణి కూడా టీడీపీని వదిలి వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయ్.
‘నేను దేవున్ని నమ్ముకున్నాను.. అలాగే జగనన్న కూడా దేవున్ని నమ్ముకున్నాడు.. అంటూ క్రిస్టియానిటీ యాంగిల్ పేరుతో ఆల్రెడీ జగన్‌కి కనెక్ట్ అయిపోయింది దివ్యవాణి. ఇక, రేపో మాపో వైసీపీ పంచన చేరిపోయినా చేరిపోతుందనేంతలోపు, ఆమె అంతా తూచ్ అనేసింది. అదే రాజకీయమంటే.!