సైన్మా

‘గాడ్ ఫాదర్’లో సత్యప్రియ జయదేవ్‌గా నయనతార.!

God Father Nayanthara.. మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగులోకి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

కాగా, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా ఈ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు.

ఇదిలా వుంటే, లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనుంది. సత్యప్రియ జయదేవ్ పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ పాత్రను తాజాగా రివీల్ చేసింది చిత్ర యూనిట్.

గాడ్ ఫాదర్.. భారీ అంచనాలున్నాయ్..

ఏ పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోయన నయనతార, ‘గాడ్ ఫాదర్ సినిమాలో చాలా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించిందనే చెప్పాలేమో.

మలయాళ వెర్షన్‌లో ఆ పాత్రకు అంత పేరొచ్చింది. తెలుగులోనూ అంతకు మించిన పవర్ ఫుల్ రోల్‌గా నయనతార పాత్రని తీర్చిదిద్దారట.

‘హనుమాన్ జంక్షన్’ ఫేం మోహన్ రాజా ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాకి దర్శకుడు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.

గతంలో చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నయనతార నటించింది. అయితే, ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మాత్రం నయనతారది చిరంజీవి సరసన హీరోయిన్ రోల్ కాదు.

Related posts

Allu Aravind Dil Raju.. ఏంటీ రగడ పరశురామా.?

admin

లైఫ్ చాలా చిన్నది.! నేను చాలా స్పెషల్: రష్మిక.!

admin

Sri Satya కి అది ‘బిగ్’ అడ్వాంటేజ్ అవుతుందా.?

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More