Nivetha Thomas
ఆటజీవనంపరదేశిప్రయాణాలుభక్తిరాజకీయంవీడియోలుసైన్మా

నివేదా థామస్.. అందాల రాక్షసివే.! గుండెల్లో గుచ్చావే.!

‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నివేదా థామస్. తొలి సినిమాకే ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నిజంగానే నివేదా థామస్ మంచి యాక్టింగ్ టాలెంట్ వున్న అమ్మాయ్ మరి. 

గ్లామర్ పాత్రల కన్నా, యాక్టింగ్ స్కోపున్న పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది. అందుకే అవకాశాలు అరకొరగానే వచ్చినా, తాను ఎంచుకున్న ప్రతి పాత్ర పట్ల తానెంతో సంతృప్తిగా వుంటానని చెబుతుంటుంది నివేదా థామస్.

నివేదాకి యాక్టింగ్ ఇప్పుడేం కొత్త కాదు. చైల్డ్ ఆర్టిస్టుగానే పలు సినిమాల్లో నటించింది. అయితే, తెలుగులో కాదు, మలయాళంలో. చైల్డ్ ఆర్టిస్టుగా వున్నప్పుడే ఆడియన్స్‌ని కట్టి పడేసింది. అంతేకాదు, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడన్ని అవార్డులు కూడా దక్కించుకుంది నివేదా థామస్.

తెలుగుతో పాటు, తమిళ, మలయాళ తదితర భాషల్లో నివేదా థామస్ నటించింది. కథల ఎంపికలో తానెప్పుడూ తొందరపడననీ, మంచి కథ దొరికితే, చిన్న పాత్రయినా నటించేందుకు తానెప్పుడూ సిద్ధంగా వుంటానని నివేదా థామస్ చెప్పుకొచ్చింది.

Nivetha Thomas

‘వకీల్ సాబ్’ కెరీర్ టర్నింగ్ మూవీ

‘జెంటిల్ మెన్’ సినిమా తర్వాత ‘నిన్ను కోరి’, ‘లవ కుశ’, ‘బ్రోచేవారెవరురా’.. తదితర సినిమాల్లో నటించిన నివేదా థామస్‌కి ‘వకీల్ సాబ్’ మూవీ కెరీర్ టర్నింగ్ మూవీ అని చెప్పక తప్పదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వచ్చిన తొలి సినిమా అది. ఆ సినిమాలో లీడింగ్ ఫిమేల్ రోల్ పోషించింది నివేదా థామస్. నటించింది.. అనే కన్నా, ఈ సినిమాలో పల్లవి పాత్రకు నివేదా థామస్ ప్రాణం పెట్టిందనడం అతిశయోక్తి కాదేమో. 

అందుకే ‘వకీల్ సాబ్’‌లోని పల్లవి పాత్రకు కనీ వినీ ఎరుగని విధంగా ప్రశంసలు దక్కించుకుంది నివేదా థామస్. కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్నిసక్సెస్‌లు అందుకున్నా వాటన్నింట్లోనూ ‘వకీల్ సాబ్’ సినిమా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పుకొచ్చింది నివేదా థామస్.

వెండితెర పైనే కాదు, సోషల్ తెరపైనా వెరీ వెరీ యాక్టివ్

ఇక ప్రస్తుతం నివేదా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ‘శాకిని డాకిని’ అను ఓ ఫన్నీ థ్రిల్లర్ కాన్సెప్టు మూవీలో నివేదా థామస్ నటిస్తోంది. అలాగే ఓ మలయాళ సినిమాలోనూ నటిస్తోంది.

Nivetha Thomas with her Brother

సినిమా స్క్రీన్ పైనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ చాలా చలాకీగా వుంటుంది నివేదా థామస్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వెరీ వెరీ యాక్టివ్. తమ్ముడితో కలిసి రకరకాల వీడియోలు చేస్తుంటుంది. ఒకింత ఫన్నీ వీడియోలు కూడా వుంటాయ్ అందులో. 

నివేదా థామస్ యాక్టివ్‌నెస్, బబ్లీనెస్.. అంతా ఆ వీడియోల్లో కనిపిస్తుంటుంది. అందుకే స్పెషల్ ఫాలోవర్లుంటారు నివేదా థామస్‌కి సోషల్ మీడియాలో.

Related posts

నయనతార చేసింది చిన్న పొరపాటు కాదు, పెద్ద నేరం.!

admin

రాజకీయాలంటే ఇష్టం, సినిమా అంటే భయం: పవన్ కళ్యాణ్

admin

కృతిశెట్టికి యాక్టింగ్ రాదా.? బేబమ్మపై ఎందుకీ నెగిటివిటీ.?

admin

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More