‘నీకూ నాకూ డాష్ డాష్’, ‘బస్టాప్’ ఫేమ్ ప్రిన్స్ (Prince Cecil) కొత్త అవతారమెత్తబోతున్నాడట. జూనియర్ మహేష్ బాబుగా ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు.
పోలికలో సూపర్ స్టార్ మహేష్‌బాబును పోలినప్పటికీ కుర్రోడికి అదృష్టం అంతంత మాత్రమే అయ్యింది. అయినా సరే, కష్టపడుతున్నాడు.
అంది వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటున్నాడు. హీరోగానే చేయాలని మడి కట్టుకుని కూర్చోకుండా.. చిన్న పాత్రలైనా ఒప్పుకుంటున్నాడు.
‘నేను శైలజ’ సినిమాలో రామ్ పోతినేనికి బావ పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే పలు హిట్ సినిమాల్లో తనదైన నటన కనబరుస్తున్నాడు ప్రిన్స్.
Prince Cecil.. కెరీర్ టర్నింగ్ పాయింట్..
ఇక ఇప్పుడు ప్రిన్స్ కెరీర్ కీలక మలుపు తిరగనుందని తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దృష్టిలో పడ్డాడీ యంగ్ హీరో. అయితే, హీరోగా కాదండోయ్.
బోయపాటి మన హీరోగారిలో విలనిజాన్ని చూశాడట. ఆలస్యం చేయకుండా ఆయనగారి కొత్త సినిమాలో విలన్‌గా ఫిక్స్ చేసేశాడు.
రామ్ పోతినేనితో బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ప్రిన్స్‌ని విలన్‌గా మార్చేశాడట బోయపాటి శ్రీను. అలాంటిలాంటి విలనిజం కాదండోయ్.
ఊహించని విధంగా మేకోవర్..
బోయపాటి సినిమాల్లో హీరో రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో తెలిసిందే. అంతలా హీరో పాత్ర పండడానికి కారణం ఆయన డిజైన్ చేసిన విలన్ పాత్రలే.
జగపతిబాబు తదితర సీనియర్ హీరోల్ని బోయపాటి అలాగే విలన్లుగా మార్చేశాడు. ఆయా హీరోలకు ఆ విలనిజం బాగా అచ్చొచ్చింది కూడా.