ఇలియానా (Ileana) ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. ఎన్నో సూపర్ హిట్లు చవి చూసింది కెరీర్లో. కానీ అది అప్పుడు. ఇప్పుడు పరిస్థితి వేరే.
ఇలియానాని అస్సలెవ్వరూ పట్టించుకోవడం లేదు. హీరోయిన్గా కాకపోయినా, పోనీ స్పెషల్ రోల్స్ కోసమో, స్పెషల్ సాంగ్స్ కోసమో అయినా కాస్త ఓ లుక్కు వేయొచ్చుగా.!
హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఆ మధ్య తెగ ట్రై చేసింది ఇలియానా. మాస్ రాజా రవితేజ పుణ్యమా అని ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో ఆ ముచ్చట తీర్చుకుంది.
Ileana.. దారుణంగా ట్రోల్ చేశారు.!
అయితే, ఆ ఒక్క ఛాన్స్తోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది ఇలియానాకి. ఆ సినిమాతో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంది ఇలియానా.
ఫిట్నెస్పై కాస్త ఫోకస్ పెట్టమని అభిమానులే ఆమెకి సలహాలిచ్చేశారు. ఇలియానా అంటేనే సన్నజాజి నడుముకు కేరాఫ్ అ్రడస్. హీరోయిన్గా అంత క్రేజ్ దక్కించుకోవడానికి ఆ నడుమే కారణం.
అలాంటిది ఆ ఫిజిక్కే ఇలియానా మంగళం పాడేసింది. డ్రమ్ములా కనిపించి, బోర్ కొట్టించేసింది. దాంతో, ఇలియానాని పూర్తిగా పక్కన పెట్టేశారు మేకర్లు.
సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రైల్స్..
అయితే, నటించాలన్న కోరిక ఇంకా చచ్చిపోలేదు ఇలియానాకి. ఎలాగైనా మళ్లీ నటనను కొనసాగించాలనుకుంటోందట. సినిమాలకు ఎలాగూ దూరం కావడంతో, కొన్నాళ్లు రష్యన్ ఫొటోగ్రాఫర్తో డేటింగ్ చేసి తెగ ఎంజాయ్ చేసింది.
ఇప్పుడు ఆ ప్రేమ కూడా పెటాకులైంది. దాంతో, లైఫ్ని చాలా బోర్గా ఫీలవుతోందట. సినిమాల్లో మళ్లీ కనిపించాలని బలంగా కోరుకుంటోందట.
ఇలియానాతో వచ్చిన చిక్కల్లా అదే.!
ఆ క్రమంలోనే ఫిజిక్ పైనా కాస్త ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. అయితే, ఇలియానాపై మేకర్లు దృష్టి పెట్టకపోవడానికి మరో కారణం కూడా లేకపోలేదు.
ఒకప్పుడు స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ఇలియానా, క్రేజ్ తగ్గినా, రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటోందట. అందుకే ఆమెపై మేకర్లకు సీత కన్ను.
మొన్నామధ్య ఓ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తే, దిమ్మతిరిగే రెమ్యునరేషన్ చెప్పిందట. దాంతో, ఆ చిత్ర యూనిట్ సింపుల్గా నో చెప్పేశారట.
ఇండస్ట్రీలో తన పూర్వ వైభవం తిరిగి తెచ్చుకోలేకపోయినా, కనీసం వున్నాననిపించుకోవాలంటే, ఇలియానా ఆ ఒక్క విషయంలోనైనా కాస్త తగ్గాల్సిందే. అప్పుడైనా ఇల్లీ బేబ్కి అరా కొరా అవకాశాలైనా రావచ్చేమో. లెట్స్ హోప్ దిస్.!