Kangana Ranaut Dhaakad.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనను తాను సినీ పరిశ్రమ అంతటికీ ‘క్వీన్’ అని అనుకుంటుంది. సినిమాలు, రాజకీయాలూ.. అన్నిటినీ కలగాపులగం చేసేస్తుంటుంది. ఇతరుల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటుంటుంది కంగనా రనౌత్.
తన తాజా చిత్రం ‘ధాకడ్’ ప్రమోషన్ కోసం కంగనా రనౌత్ చాలా అడ్డదారులు తొక్కింది. రాజకీయాల్ని తీసుకొచ్చింది. ఇంతా చేసి ‘ధాకడ్’ సినిమాతో కంగనా రనౌత్ ఏం సాధించినట్టు.? తొలి రోజు ఓపెనింగ్స్ సరిగ్గా లేకపోవడమంటే అంతకన్నా అవమానం కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్‌కి ఏముంటుంది.?
కంగనా రనౌత్ అంటే జస్ట్ హీరోయిన్ కాదు.. అంతకు మించి.! లేడీ సూపర్ స్టార్.. అనదగ్గ స్టార్డమ్ ఆమె సొంతం. కానీ, ఏం లాభం.? తనకు తానే శతృవు.. అన్నట్టు, తన స్థాయిని తనే తగ్గించేసుకుంటుంది.
Kangana Ranaut Dhaakad కథ కంచికే.!
వేరే హీరోయిన్ల మీద ‘గ్రేడ్ల’ పేరుతో విమర్శలు చేయడం కంగనా రనౌత్‌కి అలవాటే. అదే ఇప్పుడు కంగన కొంప ముంచుతుంది. కంగనా రనౌత్‌కి కూడా సీ-గ్రేడ్ అంటూ రేటింగ్స్ ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. అంతా స్వయంకృతాపరాధమే మరి.
అసలు, ‘ధాకడ్’ సినిమా రివ్యూలే చాలా తక్కువగా వున్నాయంటే, ఆమెను సినీ జనమే కాదు.. సినీ విశ్లేషకులు కూడా ఎంతలా లైట్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కంగనా రనౌత్ స్టార్డమ్ అంటే, జస్ట్ అదొక నీటి బుడగ అని తేలిపోయిందన్నది మెజార్టీ అభిప్రాయం.
‘ఏంటి పాపా ఇలా చేశావ్.?’ అంటూ కంగన అభిమానులు వాపోతోంటే, అదే డైలాగ్ పేల్చుతూ సెటైర్లేస్తున్నారు.. ట్రోలింగ్ చేస్తున్నారు ఆమెని వ్యతిరేకించేవాళ్ళు.