Keerthy Suresh
సైన్మా

‘మహానటి’కి అదే ప్లస్: కీర్తి సురేష్‌కి తిరుగులేదంతే.!

Keerthy Suresh Mahanati.. హీరోయిన్లు తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకరకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం సహజమే. నిజానికి ఈ సర్జరీల గొడవ ఇప్పటిది కాదు. అలనాటి మేటి తారలు సైతం సర్జరీలను ఆశ్రయించక తప్పలేదు.

అతిలోక సుందరి శ్రీదేవి నుంచి, నేటి గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా.. అంతెందుకు శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కూడా పలు రకాల సర్జరీలు చేయించుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ప్రస్తుతం ‘మహానటి’గా చెలామణి అవుతున్న కీర్తి సురేష్ కూడా ఈ మధ్య తన అందానికి సర్జరీలతో కొన్ని మెరుగులు దిద్దినట్లు తెలుస్తోంది. తొలి సినిమా ‘నేను శైలజ’లో కాస్త బొద్దుగా, ముద్దుగా పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత బాగా సన్నబడిపోయింది.

కామెంట్స్ లైట్ తీసుకున్న మహానటి

పావు కిలో కండ కూడా లేకుండా దాదాపు జీరో సైజ్‌కి వచ్చేసింది. జీరోసైజ్ అందాలతో కొన్ని విమర్శలు కూడా అందుకుంది మహానటి. ముఖంలోని క్యూట్‌నెస్ పోయిందంటూ, అసలు అందమే చెడిపోయిందంటూ అనేక రకాలుగా విమర్శలు ఫేస్ చేసింది.

అయినా కానీ, సక్సెస్ బాటలో ఎలాంటి కామెంట్లయినా కొట్టుకుపోతాయ్ అని కీర్తి సురేష్ విషయంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. అంతేగా చక్కనమ్మలు చిక్కినా అందమే మరి. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో ‘కళావతి’గా మురిపించింది కీర్తి సురేష్.

Keerthy Suresh
Keerthy Suresh

కళావతిగా కీర్తి సురేష్ ఆ కిక్కే వేరప్పా

మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా ఫైనల్‌గా హిట్ లిస్టులోకి చేరిపోయింది ‘సర్కారు వారి పాట’. అంతే కాదు, కీర్తి సురేష్ యాక్టింగ్ టాలెంట్ ముందు ఎలాంటి విమర్శలూ నిలబడలేకపోయాయ్.

కళావతిగా కీర్తి సురేష్ అందంగానే కాదు, కాస్త గ్లామరస్‌గానూ కనిపించి మెప్పించింది ఈ సినిమాలో. అందుకే కమాన్ కమాన్ కళావతి పాటతో కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ గునపాలు దింపేసింది అందాల కీర్తి సురేష్.

Keerthy Suresh Mahanati.. కీర్తి సురేష్ పెదాల సర్జరీ మాటేంటీ.?

కీర్తి సురేష్ పెదాలకు సర్జరీ జరిగిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయ్. ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఆ మార్పును కనిపెట్టేశారు ఆడియన్స్. ఇక అప్పటి నుంచీ కీర్తి సురేష్ పెదాల సర్జరీ హాట్ టాపిక్ అయిపోయింది.

కీర్తి సురేష్ మంచి నటి. ఎలివేషన్ సీన్లలో కీర్తి సురేష్ ముఖ కవళికలు, హావభావాలు ఆడియన్స్‌ని కట్టి పడేస్తుంటాయ్. అలాంటప్పుడు సర్జరీ చేయించుకుంటే తప్పేంటంటా.!

సక్సెస్ ముందు అందం భళాదూర్..

చెంపకు చారెడు కళ్లూ, సంపంగిలాంటి ముక్కు, రోజా రేకుల్ని పోలిన పెదాలు.. ఇవన్నీ వుంటే ఆ చక్కనమ్మ అందం మరింత చక్కగుంటది కదా.. అందుకేనేమో కీర్తి సురేష్ పెదాలకు సర్జరీ అవసరమైందేమో. అయినా ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు.

ఏది ఏమయినా కీర్తి సురేష్ విషయంలో అందం కాదు, సక్సెసే మాట్లాడుతుంది అనడం అతిశయోక్తి అనిపించదు. ఆ సక్సెస్ ఆమెకి దక్కడానికి కారణం ఆమె హార్డ్ వర్క్, యాక్టింగ్ టాలెంట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పేయొచ్చు.

Related posts

ఏంటిది సుస్మితా: విశ్వసుందరి వింత యవ్వారం.!

admin

సాయి పల్లవికి ఏం తక్కువ.? పూజా హెగ్దేకి ఏం ఎక్కువ.!

admin

Godfather Vs Lucifer: మోహన్‌లాల్ మీద ప్రేమా.? చిరంజీవిపై ద్వేషమా.?

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More