Krithi Shetty acting Skills.. క్యూట్ క్యూట్‌గా కనిపించే బేబమ్మపై దారుణంగా నెగిటివిటీ స్ర్పెడ్ అవుతోంది. ఏంటా నెగిటివిటీ అంటారా.? బేబమ్మ కృతిశెట్టికి అసలు యాక్టింగే రాదట. విచిత్రంగా అనిపిస్తోందా.?
ఓ వెబ్ మీడియా ఛానెల్ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోంది. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని, తొలి సినిమా రిలీజ్ కాకుండానే వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి.
యాక్టింగ్ రాకుంటే, ఇంత తక్కువ టైమ్‌లోనే హీరోయిన్గా అంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది కృతిశెట్టి. బేసిగ్గా కృతిశెట్టి మంచి డాన్సర్. అందులోనూ క్లాసికల్ డాన్సర్. సో, ఆమె ముఖంలో ఎలాంటి హావ భావాలైనా ఇట్టే పలుకుతాయ్.
అలంటిది యాక్టింగ్ రాదని ఎలా అనగలం.? గొప్ప నటి అనలేం కానీ, తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తుంది కృతిశెట్టి. మొదటి నుంచీ, యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలను ఎంచుకోవడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తోంది కృతిశెట్టి.

అలాగే మితి మీరిన ఎక్స్పోజింగ్ జోలికి కూడా పోదు కృతి శెట్టి. ప్రాధాన్యత వున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. ఈ విషయంలోనూ కృతి శెట్టిని మెచ్చుకుని తీరాల్సిందే.
‘బంగార్రాజు’ సినిమా అయినా, ‘శ్యామ్ సింఘరాయ్’ అయినా, ఇప్పుడు ‘ది వారియర్’ సినిమా అయినా.. ఒక్కో సినిమాకీ ఒక్కో రకంగా తనను తాను మేకోవర్ చేసుకుంటోంది కృతిశెట్టి.
కృతిశెట్టిని తిట్టి పోస్తున్న డైరెక్టర్
‘ది వారియర్’ దర్శకుడు లింగు స్వామి, యాక్టింగ్ రాదంటూ కృతి శెట్టిని షూటింగ్లో తిట్టి పోస్తున్నాడట. అదీ సదరు వెబ్ ఛానెల్ ప్రచారం వెనక సారాంశం.
అంతేనా, ఓ యంగ్ హీరో కృతి శెట్టితో కలిసి సినిమా చేయనంటున్నాడట. ఆయన ఎవరో కాదు, ఈ మధ్య ‘డీజె టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ. ఇది మరీ విచిత్రంగా లేదూ.
స్టార్ హీరోయిన్ రేంజ్‌కి దగ్గరలో వున్నకృతి శెట్టి ఎక్కడ.? సిద్ధు జొన్నల గడ్డ ఎక్కడ.? ఎలా చూసుకున్నా, కృతి శెట్టిపై ఇది కేవలం దుష్ర్రచారమే. ఇందులో నిజమెంత మాత్రమూ లేదు.
లక్కుంటే చాలు.. స్టార్డమ్ కిక్కు
అయినా స్టార్డమ్ అనేది కేవలం టాలెంట్ మీదనే బేస్ అయ్యి వుండదనీ ఎప్పటి నుంచో చాలా మంది ముద్దుగుమ్మలు ప్రూవ్ చేస్తూ వచ్చారు, ప్రూవ్ చేస్తున్నారు కూడా.
లక్కు కలిసొస్తే చాలు, టాలెంట్ వున్నా లేకున్నా స్టార్డమ్ ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. అలా అని, కృతి శెట్టికి యాక్టింగ్ రాదని అనలేం. మహానటిలా మరీ గొప్ప నటి కాకపోయినా, ఓకే చల్తా.