Krithi Shetty Crush.. ఉప్పెన భామ కృతిశెట్టి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అవును నిజమే, వరుస సినిమాలతో కృతి శెట్టి బిజీగా వుంది మరి. టాలీవుడ్ యంగ్ హీరోస్ ఒక్కొక్కరినీ చక్క బెట్టుకుంటూ వస్తోన్న బేబమ్మ, త్వరలోనే కోలీవుడ్‌ని ఏలేందుకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్‌లో ఆల్రెడీ బేబమ్మ బోనీ కొట్టేసింది. అదీ ఓ స్టార్ హీరో సినిమాతోనే కావడం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యతో బేబమ్మ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘వనమగన్’. తెలుగులో ‘అచలుడు’ టైటిల్‌తో రిలీజ్ అవుతోంది.
అన్నతో ఆగేలా లేదుగా బేబమ్మ క్రేజ్.!
అంతా బాగానే వుంది కానీ, తమిళంలో ఆల్రెడీ కాలు మోపిన బేబమ్మకు తమిళ హీరోల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే, కార్తి అని ఠక్కున సమాధానమిచ్చేసిందట. అదేనండీ సూర్య తమ్ముడు కార్తి. హమ్మ బాబోయ్..!
ఇప్పుడిప్పుడే కోలీవుడ్‌లో అడుగు పెట్టింది అప్పుడే తమిళ హీరోతో క్రష్ అంటోంది.. అది కూడా అన్నయ్య సినిమాలో నటిస్తూ, తమ్ముడితో క్రష్ అంటోంది.. అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. అదీ మరి బేబమ్మ అంటే.!

చెబితే చెప్పింది కానీ, త్వరలోనే తన క్రష్ కార్తితోనూ బేబమ్మ ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలే కృతి శెట్టి వంటి బొద్దు ముద్దుగుమ్మలు తమిళ తంబీలకు తెగ నచ్చేస్తుంటారు కూడా.
కాగా, విజిల్ మహాలక్షిగా ‘ది వారియర్’ సినిమాలో దుమ్ము దులిపేసిన కృతి శెట్టి, త్వరలో నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాతో సందడి చేయనుంది.
Krithi Shetty Crush.. అందాల గడుసరి..
సినిమాలతో ఇంత బిజీగా వున్నా, కృతిశెట్టి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. అందుకే కృతి శెట్టిని ఫాలో అయ్యే ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ అమాంతం పెరిగిపోతోంది.
అమ్మడి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తూ, నెటిజనం సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఆ జోరుకు బూస్టప్ ఇచ్చేస్తూ, బేబమ్మ కూడా అస్సలు తగ్గేదే లే.. అనే రేంజ్లో దూసుకెళ్లిపోతోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోస్నీ, డాన్సింగ్ వీడియోలనూ పోస్ట్ చేస్తూ కిర్రాకు పుట్టిస్తోంది నెటిజనానికి. రిలీజవుతున్న సినిమాల ప్రమోషన్ల పేరు చెప్పి కూడా కృతి శెట్టి ఇంకాస్త ఫాలోయింగ్ మూట కట్టుకుంటోంది. ఏది ఏమైనా బేబమ్మ స్కెచింగే స్కెచింగు అదిరిపోయిందంతే.!