ముద్దుగుమ్మ కృతి సనన్ (Kriti Sanon), ప్రబాస్ (Prabhas)ని పెళ్లి చేసుకోబోతోందంటూ ఈ మధ్య పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆది పురుష్’ సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అవుతుండడం చూసి, వీరి మధ్య సమ్‌థింగ్ సమ్థింగ్లాంటిదేదో వుందని ఊహించేశారు.
Kriti Sanon.. ప్రబాస్ – కృతి సనన్ డేటింగ్లో వున్నారా.?
అక్కడితో ఆగకుండా, ఇద్దరూ డేటింగ్లో వున్నారనీ, కాదు కాదు, పీకల్లోతు లవ్వు అనీ ప్రచారాలు పుట్టించారు. లేటెస్టుగా కృతి సనన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘భేడియా’ ప్రమోషన్లలో హీరో వరుణ్ ధావన్ ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా బయట పెట్టేశాడంటూ మరో వార్త కొత్తగా హల్చల్ చేసింది.
దాంతో, కృతి సనన్ స్పందించక తప్పలేదు. ఈ ప్రచారం అంతా వుత్తదే అంటూ స్వయంగా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యింది. ప్రబాస్ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.
వరుణ్ ధావన్ జస్ట్ జోక్ చేశాడంతే అని సింపుల్‌గా తేల్చేసింది. హూప్స్.! కృతి సనన్ క్లారిటీ అయితే ఇచ్చేసింది కానీ, ఎలాగోలా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రబాస్ ఇలాగైనా పెళ్లి పీటలెక్కబోతున్నాడన్న ఆనందం కొన్ని క్షణాల్లోనే కరిగిపోయింది పాపం ఫ్రబాస్ ఫ్యాన్స్‌కి.