Lalitha Jewellery Kiran
జీవనం

లలితా జ్యుయెలరీ కిరణ్ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

Lalitha jewellery.. లలితా జ్యయెలరీ.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరిది. చాలా చిన్న స్థాయి నుంచి, బంగారు నగల వ్యాపారంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు లలిత జ్యయెలరీ అధినేత కిరణ్.

‘డబ్బులు ఎవరికీ ఊరికినే రావు..’ అంటారు కిరణ్. ఆ ఒక్క డైలాగ్ సగటు బంగారు ఆభరణాల కొనుగోలుదారుల్ని ఆలోచనలో పడేసింది. అంతేనా, ‘మా వద్దనే బంగారు నగలు కొనాలని చెప్పను. మా ధరలతో వేరే చోట ధరల్ని పోల్చి చూడండి..’ అంటారు లలిత జ్యుయెలరీ సంస్థ అధినేత.

ప్రముఖ సినీ తారలతో తమ సంస్థకు ప్రచారం చేసుకోవాలని తానెప్పుడూ అనుకోలేదనీ, అలా చేయడం కోసం ఆయా సెలబ్రిటీలకై వెచ్చించే మొత్తాన్ని తగ్గించుకుని, బంగారు నగల కొనుగోలు దారులకోసం వివిధ పథకాల్ని ప్రవేశపెడుతుంటామని లలిత జ్యుయెలరీ అధినేత చెబుతారు.

Lalitha jewellery.. సక్సెస్ ఎవరికీ ఊరికే రాదు..

బహుశా ఇదే లలిత జ్యుయెలరీ కిరణ్ సక్సెస్ సీక్రెట్ అయి వుండొచ్చు. నిజానికి, లలిత జ్యుయెలరీ తాను స్థాపించింది కాదనీ, వేరే వ్యక్తులు స్థాపించిన సంస్థను తాను టేకోవర్ చేశానని చెబుతారాయన.

Lalitha Jewellery Kiran
Lalitha Jewellery Kiran

తన తల్లి గాజులు అమ్మి తాను ఈ వ్యాపారం ప్రారంభించాననీ, నిజాయితీనే తన సక్సెస్ సీక్రెట్ అనీ లలిత జ్యుయెలరీ కిరణ్ పలు సందర్భాల్లో చెప్పారు.

నిజానికి, బంగారు నగల దుకాణంలోకి వెళితే, అక్కడ చిత్ర విచిత్రమైన హంగామా కనిపిస్తుంటుంది. నగల్ని మన చేత్తో టచ్ చేయడానికి కూడా కొన్ని చోట్ల ఇబ్బందికరంగా వుంటుంది. అయితే లలిత జ్యుయెలరీ కథ వేరు. నగల్ని ఫొటో తీసుకోవచ్చు, కొనకుండానే బిల్లులూ తీసుకోవచ్చు. ఆ బిల్లుల్ని వేరే చోట నగలతో పోల్చి చూసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా లలిత జ్యుయెలరీని మరింత విస్తరింపజేయాలనే ప్లాన్‌తో వున్నారట సంస్థ అధినేత కిరణ్ కుమార్. సక్సెస్ ఎవరికీ ఊరికినే రాదు మరి.!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More