మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలుగులో స్ర్టెయిట్ సినిమా చేయలేదింతవరకూ. కానీ, తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.
తమిళ సినిమాలతో వరుసగా బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. తమిళంలో తొలి నుంచీ స్టార్ హీరోలతోనే స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది.
‘మాస్టర్’ సినిమాతో డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ‘మారన్’ సినిమా కోసం ధనుష్‌తో జత కట్టింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది.
Malavika Mohanan ఇమేజ్‌కి డ్యామేజ్ చేసేందుకేనా.?
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా, తనకున్న క్రేజ్‌ని బాగా సద్వినియోగం చేసుకుంటుందీ అమ్మడు. ముచ్చటగా మూడో చాన్స్ కోసం ఏకంగా చియాన్ విక్రమ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది అందాల మాళవిక.

అయితే, ఇప్పుడీ సినిమా గురించి ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి మాళవికను తీసేశారనీ ప్రచారం జరుగుతోంది. మాళవిక నటన పట్ల ఈ సినిమా డైరెక్టర్ అంత సంతృప్తికరంగా లేని కారణంగా హీరోయిన్ని మార్చేశారంటూ ప్రచారం జరుగుతోంది.
ఆల్రెడీ షూటింగ్లో వున్న సినిమా నుంచి హీరోయిన్ని మార్చేయడం.. అది కూడా నటన బాగోలేదన్న కారణం చూపి తీసేయడమనేది చాలా అరుదుగా జరుగుతుంది.
మాళవిక విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం నిజంగా నిజమేనా.? లేక అనూహ్యంగా దక్కించుకున్న మాళవిక ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు జరుగుతున్న వుత్త ప్రచారమేనా.? అనేది మాళవిక రెస్పాండ్ అయితే కానీ తెలీదు.
అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ప్రబాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలో మాళవిక మోహనన్ నటిస్తోంది. ఇదే తెలుగులో మాళవికకు తొలి స్ర్టెయిట్ సినిమా.