Mithali Rraj.. ఇండియన్ విమెన్స్ క్రికెట్‌కి మహా రాణి మిథాలీ రాజ్. అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడొచ్చు అనే ఆలోచన రావడానికి కారణం ఆమె. ఇండియన్ మహిళా క్రికెట్‌కి తనదైన శైలిలో సరికొత్త గ్లామర్ అద్దిన మిథాలీ రాజ్.. ఆ స్టేజ్ అందుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో విమర్శలూ, మరెన్నో అడ్డంకులూ.. అన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగింది.
అమ్మాయిల గేమ్ క్రికెట్ కాదు.. అంటూ చాలా మంది చాలా రకాలుగా మిథాలీ రాజ్‌ని డీ గ్రేడ్ చేయడానికి ట్రై చేశారు. మగరాయుడిలా గ్రౌండ్లో ప్యాంటు, షర్టూ వేసుకుని పరుగులు తీస్తావా.? అంటూ అవమానించారు.
లేదు. ఈ తరం అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అందుకే ఈ తరం మహిళా జాతికి ఆమె ఓ స్పూర్తి.
లేడీ క్రికెటర్‌గా మిథాలీ రాజ్ ఎన్ని అవార్డులు, రివార్డులూ దక్కించుకుంది. ఎన్ని పరుగులు తీసింది అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే, గూగుల్ సెర్చ్‌లో వెతుక్కోవచ్చు. కానీ, ఆ రివార్డుల వెనక దాగిన ఆమెలోని తపన ఏ ఇంటర్నెట్ సెర్చ్‌లోనూ లభించనే లభించదు.
క్రికెట్ అంటే అబ్బాయిలకు మాత్రమేనా.?
అబ్బాయిలు మాత్రమే ఆడగలిగే ఆట క్రికెట్.. అనే సాంప్రదాయం నుంచి ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడగలరు.. అందుకు సాక్ష్యం నేనే.. అని మిథాలీ రాజ్ నిరూపించింది.
ఒకానొక టైమ్‌లో ఓ కమర్షియల్ యాడ్‌కి సంబంధించి ఆమె ధరించిన దుస్తులు కాస్త వల్గర్‌గా వున్నాయంటూ, జుగుప్సాకరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది మిథాలీ రాజ్. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని సైతం ఆమె తట్టుకుని నిలబడగలిగింది.

ఏం.! మగ క్రికెటర్లు మాత్రమే కమర్షియల్ యాడ్స్‌లో నటించాలా.? మహిళా క్రికెటర్లు ఎందుకు నటించకూడదు.? అని ధైర్యంగా నిలదీసింది మిథాలీ రాజ్. పైకి ధైర్యంగా కనిపించినా, ఆ పరిస్థితుల్లో ఆమె అనుభవించిన బాధ వర్ణనాతీతం.
క్రికెట్ ధిగ్గజం అయినప్పటికీ, వల్గర్ కామెంట్లు సైతం..
సాటి ఆడదాని బాధ మరో ఆడదానికి మాత్రమే తెలుస్తుంది.. అంటారు. కానీ, ఆ టైమ్‌లో ఆమెను వ్యతిరేకించిన ఆడవాళ్లు సైతం చాలా మందే వున్నారు. అయినా కుంగిపోలేదు మిథాలీ రాజ్. ధైర్యం కోల్పోలేదు.
కంటిన్యూస్‌గా లాంగ్ కెరీర్ క్రికెట్లో ఓ మహిళ కొనసాగడమన్నది చాలా చాలా కష్టమైన అంశం. కానీ, మిథాలీ రాజ్ అందులోనూ గ్రేట్ అనిపించుకుంది. క్రికెట్లో లాంగ్ కెరీర్ కొనసాగించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా క్రెడిట్ దక్కించుకుంది.
రిటైర్మెంట్ ఆలస్యం అందుకేనా.?
అందుకు కారణం, ఆమెను రీప్లేస్ చేయగలిగే క్రికెటర్ ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్‌లో లేకపోవడమే. ఎప్పుడో క్రికెట్ నుంచి రిటైర్ అయిపోవాల్సింది మిథాలీ రాజ్.
ఆ కారణంగానే ఆమె రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నా, తన సేవలు ఇంకా ఇండియన్ క్రికెట్ టీమ్‌కి అవసరం అనే నెపంతో తన కెరీర్‌ని కొనసాగిస్తూ వచ్చింది.
నో డౌట్.! మిథాలీ రాజ్ వంటి మరో మహిళా క్రికెటర్ని మళ్లీ చూడలేం. అందుకే ఆమె జీవితం మహిళా లోకానికే స్పూర్థి. అందుకే ఒక్క సచిన్ టెండూల్కర్ కాదు, వందల సచిన్ టెండూల్కర్‌లతో మిథాలీ రాజ్‌ని పోల్చడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.