పాము.. అంటే ఎవ్వరికి భయం వుండదు చెప్పండి. అందులోనూ విషపూరితమైన పాము అంటే.. ఇక అంతే సంగతి. మనం చెప్పుకోబోయే పాము ఎంత డేంజరస్ అంటే.. ఒక్క కాటుతో 100 మంది మనుషులు ఫసక్ అంట.
వామ్మో.! అలాంటి పాములకు చాలా దూరంగా వుండాలి సుమా.! అనుకుంటున్నారా.? అంత సీనూ సినిమా లేదులెండి. అదృష్టం ఈ డేంజరస్ పాము ఇండియాలో కనిపించే ఛాన్సే లేదు.
ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ అత్యంత విషపూరిత పాములు సంచరిస్తుంటాయట. అది కూడా దట్టమైన మారుమూల అటవీ పాంతాల్లో. రాత్రి పూట మాత్రమే ఈ పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయట.
Most Venomous snake.. ఇంతకీ ఆ పాము పేరేంటో.!
‘ఇన్లాండ్ తైవాన్’ అను నామధేయురాలైన ఈ పాము ఒక్క కాటుతో 100 మంది మనుషుల్ని చంపేస్తుందట. చూశారా.! ఎంత పవర్‌పుల్లో దీని విషం.
మనుషులైతే సెంచరీనే. మరి మూషికాల సంగతి తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒక్క కాటుతో ఏకంగా 2, 50,000 మూషికాలు అవుట్ అన్నమాట.
ఇన్లాండ్ తైవాన్ ఒక్క కాటుకి 110 మిల్లీల విషాన్ని బయటికి వెలువరిస్తుందని బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పాము లక్షణాలు..
సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుందట ఇన్లాండ్ తైవాన్. అలాగే, ఈ పాము కోరలు 3.5 నుంచి 6.2 మి.మిల వరకూ పొడవుంటాయట.
అన్నట్లు ఈ పాము సీజనల్‌గా రంగులు మారుస్తుందటండోయ్. అయితే ఊసరవెల్లి మాదిరి అన్ని రకాల రంగులు కాదులెండి. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమరంగులోనూ తారసపడుతుందట.