డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యా.! అని చాలా మంది సెలబ్రిటీలు సహజంగా చెప్పే మాటే. కానీ, కొందరు సెలబ్రిటీలు నిజంగానే డాక్టర్ అయ్యి యాక్టర్ కూడా అవుతుంటారు. సాయి పల్లవి లాంటి ముద్దుగుమ్మలు డాక్టర్ చదివి, యాక్టర్‌గానూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
అయితే, మనం చర్చించుకుంటోన్న ముద్దుగుమ్మ ముచ్చట వేరే. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు ఇప్పుడు. ‘సీతారామం’ సినిమాతో తిరుగులేని స్టార్ దక్కించుకుంది మృణాల్ ఠాకూర్.
Mrunal Thakur.. జర్నలిస్ట్ కావాలనుకుందట
మృణాల్ నటి కాకుంటే ఏమై వుండేదో తెలుసా.? ఓ డాక్టర్, ఓ లాయర్, ఓ జర్నలిస్ట్.. ఇలా చాలా ట్రై చేసేసిందట. ముఖ్యంగా మీడియాలో జర్నలిస్టుగా ఎదగాలన్నది మృణాల్ కోరికట.
మొదట్లో తన కెరీర్‌ని జర్నలిజం వైపే నడిపించిందట మృణాల్. కానీ, అప్పట్లో ఫ్యామిలీ నుంచి అబ్జక్షన్స్ రావడంతో ఆ ప్రయత్నం విరమించుకుందట.

ఆ తర్వాత స్నేహితులు చెప్పిన మాటలు విని సినీ రంగం వైపు ఆకర్షతురాలినయ్యానని మృనాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మోడలింగ్‌లో రాణించిన మృణాల్, తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందట.
సినిమాల్లో అవకాశాల కోసం చాలా చాలా కష్టపడ్డానని చెబుతోంది మృణాల్.కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాననీ, తన కెరీర్ ఏమంత సాఫీగా సాగలేదని చెబుతోంది.
చచ్చిపోవాలనుకుందట..
వన్ డే స్టార్‌ని అస్సలు కాదంటోంది మృణాల్ ఠాకూర్. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొస్తోంది. కెరీర్లో నిలదొక్కుకోలేక ఒకానొక టైమ్‌లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందట మృణాల్. కదులుతున్న ట్రైన్లోంచి దూకేయాలనుకుందట.
కానీ, ఒక్క క్షణం విచక్షణతో ఆలోచించి, ఆ ప్రయత్నం విరమించుకుందట. ఫెయిల్యూర్స్ అనేవి అందరి లైఫ్‌లోనూ వస్తాయ్ కానీ, వాటిని ఆవేశంతో కాదు, ఆలోచనతో అధిగమిస్తే మంచి ఫ్యూచర్ వుంటుందనడానికి తన జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని మృణాల్ ఠాకూర్ చెబుతోంది.