Nayanthara Vignesh Shivan Tirumala
సైన్మా

నయనతార చేసింది చిన్న పొరపాటు కాదు, పెద్ద నేరం.!

Nayanthara Vignesh Shivan Tirumala.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నటి నయనతార పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

తిరుమలలో చేసుకోవాలనుకున్న వివాహం కాస్తా, మహాబలిపురం వేదికగా జరిగింది. అక్కడి నుంచి తిరుమలకు వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు నూతన దంపతులు.

ఇక్కడిదాకా బాగానే వుంది.! కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆలయం యెదుట ఫొటో షూట్, ఆపై మాడ వీధుల్లో చెప్పులతో తిరగడం.. వెరసి విఘ్నేష్ శివన్, నయనతార వివాదాల్లోకెక్కారు.

టీటీడీ విజిలెన్స్ విభాగం చేష్టలుడిగా వ్యవహరించడమే దీనికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది నిర్లక్ష్యంపై టీటీడీ కూడా స్పందించింది. నయనతార, విఘ్నేష్ శివన్‌లపై చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది.

Nayanthara Vignesh Sivan Tirumala.. తప్పిదం కాదిది, మహా పాపం.!

చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనమేముంది.? దీన్ని చిన్న పొరపాటుగానో, నిర్లక్ష్యంగానో, తప్పిదంగానే కొందరు లైట్ తీసుకోవచ్చుగాక. కానీ, జరిగింది ఘోర తప్పిదం. ఆషామాషీ వ్యవహారం కాదిది.

Nayanthara Vignesh Shivan Tirumala

తిరుమల గిరులకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వున్నాయి. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి వున్న అంశమిది. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడమేంటి.?

ఈ ఘటనపై విఘ్నేష్ శివన్, నయనతార క్షమాపణ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. లేఖ రాస్తే సరిపోతుందా.? అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారన్నదానికి వాళ్ళు ఏం సమాధానం చెబుతారు.?

సెలబ్రిటీలు కదా.! ఏమైనా చేయొచ్చు.!

సెలబ్రిటీలు అయితే, తాము ఏం చేసినా చెల్లిపోతుందనే భావనలో విఘ్నేష్, నయన్ వున్నట్లున్నారన్నది భక్తుల ఆవేదనగా కనిపిస్తోంది. సాధారణ భక్తులకేమో తిరుపతిలో నానా అగచాట్లు. వీవీఐపీ భక్తులకే ప్రత్యేక వెసులుబాట్లు, సౌకర్యాలు.

దేవుడి ముందు అందరూ సమానం కానే కాదు. సెలబ్రిటీలు వేరు, సామాన్యులు వేరు. సామాన్యు తప్పు చేయకపోయినా, ఈడ్చి పారేసే టీటీడీ సిబ్బంది, సెలబ్రిటీలు అపచారాలకు పాల్పడినా చూసీ చూడనట్టు వ్యవహరించడం దారుణం.

Related posts

దిశా పటానీ గురించి మీకీ నిజాలు తెలుసా.?

admin

రాజకీయాలంటే ఇష్టం, సినిమా అంటే భయం: పవన్ కళ్యాణ్

admin

కేక పుట్టిస్తున్న కావ్య థాపర్: అంతలా కవ్విస్తే ఎలా మరి.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More