NCB Charges On Rhea Chakraborty
సైన్మా

అడ్డంగా బుక్కయిపోయిన రియా చక్రవర్తి: బయటపడడం కష్టమేనా.?

NCB Charges On Rhea Chakraborty .. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మేటర్ రెండేళ్ల క్రితం ఎంతగా సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇష్యూకి సంబంధించి హీరోయిన్ రియా చక్రవర్తి కేసుల్లో ఇరుక్కున్న సంగతి కూడా తెలిసిందే.

సుశాంత్‌కి లవర్ అయిన రియా చక్రవర్తి, సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించడానికి ప్రధమ కారణం ఆమెనే.. అంటూ ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ సూసైడ్‌కి డ్రగ్స్ లింకు వుందంటూ, అదే టైమ్‌లో డ్రగ్స్ కేసు కూడా తెరపైకి వచ్చింది.

ఓ పక్క లవ్వూ పోయే.. ఇంకో పక్క కెరీరూ నాశనమాయె.!

అలా డ్రగ్ర్స్ ఆరోపణల్లో ప్రాధమిక ఆధారాలు దొరకడంతో, అప్పుడే రియా చక్రవర్తి అరెస్టయ్యింది కూడా. ఎలాగోలా పాట్లు పడి బెయిల్ తెచ్చుకుంది రియా చక్రవర్తి.

NCB Charges On Rhea Chakraborty

ఆ కారణంగా ఆమె కెరీర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు చేజారిపోయాయ్. అప్పటికే సైన్ చేసిన ఛాన్సెస్ కూడా క్యాన్సిల్ చేసుకోవల్సి వచ్చింది రియా చక్రవర్తి.

NCB Charges On Rhea Chakraborty.. నార్కోటిక్స్: అంత ఆషామాషీ కాదుగా.!

ఆ సంగతి అలా అక్కడితో అయిపోయిందా.? అంటే అవ్వనే లేదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఛార్జి షీట్లు దాఖలు చేసింది.

ఈ ఛార్జి షీట్లలో NCB 35 మంది పేర్లను ప్రస్థావించింది. అందులో ప్రముఖంగా మళ్లీ రియా చక్రవర్తి పేరే వినిపిస్తోంది. నార్కోటిక్స్ ఇష్యూ అంటే అంత ఈజీ కాదు. నేరం ప్రూవ్ అయితే, జైలు శిక్ష తప్పనే తప్పదు.

మరి, ఈ చిక్కు ముడి నుంచి రియా చక్రవర్తి ఎలా తప్పించుకుంటుంది. అసలు తప్పించుకోవడం సాధ్యమేనా.?

Related posts

నెటిజన్‌పై విరుచుకు పడ్డ సివంగి బిందుమాధవి.!

admin

Aishwarya Lekshmi.. అందం, అభినయం ‘ఐశ్వర్య’మే.!

admin

‘మహానటి’కి అదే ప్లస్: కీర్తి సురేష్‌కి తిరుగులేదంతే.!

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More