nithya-menon-marriage
సైన్మా

నిత్యా మీనన్ పెళ్లంట.! వరుడు ఎవరంటే.!

Nithya Menon Marriage.. సెలబ్రిటీల విషయంలో రూమర్లు చాలా చాలా కామన్. ఎందుకంటే, సెలబ్రిటీస్ జీవితాలు తెల్ల కాగితాల వంటివి. వాటిపై ఎవరైనా, ఎవరికి నచ్చిందైనా ఈజీగా రాసేసుకోవచ్చునన్న అభిప్రాయాలుంటాయ్. దాంతో అనవసరమైన రూమర్లు క్రియేట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడే.

కొందరు సెలబ్రిటీలు వాటిని వెంటనే ఖండిస్తుంటారు. మరికొందరు పట్టించుకోరు. ఇంకొందరైతే ఫైర్ అవుతుంటారు. అయితే, ముద్దుగుమ్మల విషయంలో లవ్ రూమర్స్ చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయ్. అలా అని అందరి మీదా రావాలని లేదు. కొందరు ముద్దుగుమ్మల విషయంలో చాలా చాలా తక్కువగా ఇలాంటి రూమర్లు వినిపిస్తుంటాయ్. అందులో కాజల్ మొదటి ప్లేస్‌లో వుంటుంది.

Nithya Menon Marriage.. నిత్యా మీనన్ లవ్వులో పడిందా.!

ఇప్పుడయితే కాజల్ పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకి తల్లి కూడా అయిపోయిందనుకోండి. ఇక ఆ తర్వాతి స్థానం సహజ నటి నిత్యామీనన్ అనే చెప్పొచ్చు. టాలెంటెడ్ యాక్ట్రస్ అయిన నిత్యా మీనన్, తాజాగా లవ్వులో పడిందట.. అనే రూమర్ అందరికీ షాకిచ్చింది.

nithya-menon-marriage
nithya-menon-marriage

ఎప్పుడూ లేని విధంగా, నిత్యా మీనన్‌పై ఇలాంటి రూమర్ ఏంటా.? అని అందరూ షాకవుతున్నారు. అయితే, నిత్యా మీనన్ లవ్వులోనే కాదు, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోందట. అదీ తాజా వార్తల సారాంశం.

ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మలయాళ స్టార్ హీరోతో నిత్యా మీనన్ పెళ్లి జరగబోతోందట. ఆ హీరో పేరు, వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు కానీ, నిత్య పెళ్లి చేసుకోవడం నిజమే అంటున్నారు. మరి, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే నిత్యా మీనన్ డైరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వాలి.

కేవలం నటి మాత్రమే కాదు..

ఇక, నిత్యా మీనన్ సినిమాల లిస్టు తీస్తే, ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. కొన్ని ప్రత్యేకమైన సినిమాలతో ప్రత్యేకమైన సక్సెస్‌లు అందుకుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ తదితర భాషల్లోనూ నిత్యా మీనన్ నటించింది.

కేవలం నటన మాత్రమే కాదు, నిత్యాలో ఇతరత్రా టాలెంట్లు కూడా మెండుగా వున్నాయ్. నిర్మాణం, డైరెక్షన్, రైటింగ్, సింగింగ్.. ఇలా మల్టీ టాలెంటెడ్ ప్యాకేజ్‌గా నిత్యా మీనన్‌ని అభివర్ణించొచ్చు. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటించింది నిత్య మీనన్. అలాగే ‘హైద్రాబాద్ మోడ్రన్ లవ్’ వెబ్ సిరీస్‌లోనూ నటించింది నిత్యా మీనన్.

Related posts

అడ్డంగా బుక్కయిపోయిన రియా చక్రవర్తి: బయటపడడం కష్టమేనా.?

admin

Ram Charan.. అరుదైన పురస్కారమ్.!

admin

నివేదా థామస్‌కి అసలేమయ్యింది.?

admin

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More