Nivetha Thomas.. హీరోయిన్ నివేదా థామస్ చిత్రమైన సమస్యని ఎదుర్కొంటోంది. నిజానికి, కొందరు హీరోయిన్లు ఈ తరహా సమస్యల్ని ఎదుర్కొన్నారు.. చివరికి సినిమాలకు దూరమయ్యారు కూడా.
అసలు నివేదా థామస్‌కి ఏమయ్యింది.? మొదటి నుంచీ కాస్త బొద్దుగానే కనిపించే నివేదా థామస్, మధ్యలో కాస్త సన్నబడినట్లే సన్నబడి.. ఆ తర్వాత మళ్ళీ మరింత బొద్దుగా మారడం మొదలైంది.
ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నట్లుగా మారిపోయింది నివేదా థామస్. ఈ విషయమై సోషల్ మీడియాలో భయానకమైన రీతిలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఇలాగైతే కష్టమే సుమీ..
‘వకీల్ సాబ్’ సినిమా సమయంలోనే నివేదా థామస్ పర్సనాలిటీ మీద బోల్డన్ని నెగెటివ్ కామెంట్స్ పడ్డాయి. తన తాజా చిత్రం ‘శాకిని డాకిని’ ప్రమోషన్ల సమయంలో మరింత లావుగా కనిపిస్తోంది నివేదా థామస్.
సరే, శరీర కొలతల్ని బట్టి.. హీరోయిన్లను ట్రోల్ చేయడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. కానీ, హీరోయిన్ అంటే, కొలతలు తప్పక పాటించాలన్నది గ్లామర్ రూల్.
గతంలో నిత్యా మీనన్ కూడా పెరుగుతున్న బరువుని అదుపు చేసుకోలేక, అవకాశాల్ని కోల్పోయింది. అయినాగానీ, నటిగా ఆమె తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూనే వుంది.
నివేదా థామస్ కూడా మంచి నటి. బోల్డంత ఫ్యూచర్ వున్న యంగ్ హీరోయిన్ కూడా. ఫిజిక్ విషయంలో కాస్త ఫోకస్ పెట్టకపోతే, కెరీర్ ఖతం అయిపోవడం ఖాయమే.