Pawan Kalyan Kushi పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. యూత్‌కి అప్పట్లో ఓ సెన్సేషన్ ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురిపించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా చెబుతారు ‘ఖుషి’ మూవీని.
తమిళ నటుడు, దర్శకుడు అయిన ఎస్.జె.సూర్య ఈ సినిమాకి దర్శకుడు. అయితే, ఈ సినిమాని తమిళ సినిమాకి రీమేక్‌గా చెబుతుంటారు. కానీ, ‘ఖుషి’ స్ట్రెయిట్ తెలుగు సినిమా. రీమేక్ కానే కాదు.. అని ఎస్.జె.సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Pawan Kalyan Kushi.. ‘ఖుషి’ రీమేక్ ప్రచారం వెనక పెద్ద కథే వుందిగా..
‘ఖుషి’ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో ఇళయదళపతి విజయ్ హీరోగా నటించాడు. ఆ లెక్కల్లో ఈ సినిమా బైలింగ్వల్ మూవీ అవుతుంది. కానీ, రీమేక్ కాదు.
‘ఖుషి’ రీమేక్ అనడానికి కారణాల్లేకపోలేదు. ఈ సినిమా మొదట తమిళంలో రిలీజ్ అయిపోయింది. అప్పటికింకా తెలుగులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనేలేదట.
తమిళ్లో నెగిటివ్ టాక్..
తమిళంలో ఫస్ట్ వీక్ నెగిటివ్ టాక్ తెచ్చుకుందట ‘ఖుషి’. దాంతో తెలుగులో ఈ సినిమా మేకింగ్ విషయమై కొన్ని అనుమానాలు అలుముకున్నాయట. ఫస్ట్ వీక్ ఎస్.జె.సూర్య సినిమా ఆపేయాలనుకున్నాడట కూడా.
కానీ, ముందుగానే కథ తెలిసిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సినిమా చేయాల్సిందే.. అని సూర్యను ప్రోత్సహించారట. అంతేకాదు, తెలుగులో చాలా మార్పులు చేశారట. పవన్ సూచనలతోనే ఆ మార్పులు చేశామనీ ఎస్.జె సూర్య చెప్పుకొచ్చారు.
Pawan Kalyan Kushi.. ‘ఖుషీ’ లవ్ ట్రాక్ వేరే లెవల్..
అప్పటికీ, ఇప్పటికీ అదో ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు ‘ఖుషీ’ సినిమాని. ఆ తర్వాత ఈ కాన్సెప్టు చాలా సినిమాలకు నాంది, ప్రస్థావనగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ చాలా కొత్తగా వుంటుంది.
చాలా సినిమాల్లో ఆ లవ్ ట్రాక్‌ని వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ, ‘ఖుషీ’ రేంజ్ వేరే లెవల్ అంతే. అన్నట్లు ఇన్నేళ్ల తర్వాత లేటెస్టుగా ‘ఖుషి’ టైటిల్ వాడుకునే సాహసం చేశారండోయ్.
విజయ్ దేవరకొండ పెద్ద సాహసమే చేశాడుగా
అదే, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. లేటెస్టుగా ఈ ముచ్చట రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో లేటెస్ట్ ‘ఖుషి’ టైటిల్ అనౌన్స్ చేశారు. సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకి. అన్నట్లు ఇది కూడా మాంచి రొమాంటిక్ స్టోరీయేనటండోయ్.
ప్రస్తుతం కాశ్మీర్‌లోని ప్రకృతి అందాల నడుమ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరి, ‘ఖుషి’ రేంజ్ రొమాంటిక్ అప్పీల్‌ని లేటెస్టు ‘ఖుషి’ క్యాచ్ చేయగలుగుతుందా చూడాలి మరి.