Power Star Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ.. కామెడీ టైమింగ్ సంగతి సరే సరి. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఒక్కోసారి పవన్ కళ్యాణ్ టైమింగ్‌తో చెప్పే డైలాగులు ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తాయ్.!
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది.? అప్పటికి జనసేన పుంజుకుంటుందా.? లేదా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, జనసేన ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడవని స్థాయికి పవన్ కళ్యాణ్.. ఓ పొలిటికల్ సెటైరికల్ బాంబ్ పేల్చేశారు కొన్నాళ్ళ క్రితం.
‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వను..’ అంటూ జనసేనాని, కొన్నాళ్ళ క్రితం ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం ఇంకా ఇంకా కొనసాగుతూనే వుంది.
బాగా గట్టిగా గిల్లేసినట్టున్నాడు..

పవన్ కళ్యాణ్‌ని అసలు ఓ రాజకీయ నాయకుడిగానే చూడటంలేదంటూ మంత్రులు కొందరు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే, ‘సీబీఎన్ దత్త పుత్రుడు’ అని విమర్శిస్తున్నారు. ఇలా నిత్యం, ఏదో ఒక విమర్శ పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ నుంచి వస్తోంది.
జనసేన శ్రేణులు కూడా కౌంటర్ ఎటాక్ గట్టిగానే ఇస్తున్నారు. తద్వారా జనసేన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళిపోతోంది. టీడీపీ – జనసేన కలిస్తే ఏదో అద్భుతం జరుగుతున్న భయం వైసీపీలో కలిగేలా జనసేనాని చేయగలిగారు.
వాస్తవానికి టీడీపీ – జనసేన కలిసినా తమకేమీ కాదన్న నమ్మకం ఒకప్పుడు వైసీపీలో వుండేది. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. తిరిగి ఆ నమ్మకాన్ని వైసీపీ శ్రేణులు పొందడం కష్టం. వెరసి, ఏపీ రాజకీయాల్లో జనసేనాని సృష్టించిన ప్రకంపనలు తారాస్థాయికి చేరాయన్నమాట.