Prabhas Salar.. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ నటిస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందులో భాగంగానే తాజాగా ప్రబాస్ నటిస్తున్న చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడీ సినిమాకి.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్‌కి సిద్దమవుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలూ, మేకింగ్ వేల్యూస్.. ఇలా చెప్పుకుంటూ పోతే, ‘సలార్’ ఓ భారీ ప్రాజెక్ట్ మూవీ.
Prabhas Salar.. పార్ట్ 2 మొదలెట్టేదెప్పుడంట.!
ఈ బిగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని ప్రశాంత్ నీల్ ఒకటి కాదు, రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నాడట.
Also Read:ఏవండోయ్ నానీగారూ.! కాస్త ఎక్కువైనట్లు లేదూ.!
అయితే, ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ మాత్రమే ఇప్పటికి కంప్లీట్ అయ్యిందట. రెండో పార్ట్‌కి కథ రెడీగానే వుంది. కానీ, షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనీ తెలుస్తోంది.
రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని మాత్రం ‘సలార్ టీమ్ ఫిక్సయిపోయిందట. అంటే ‘బాహుబలి’ మాదిరి అన్నమాట.
ఎన్టీయార్ సినిమా తర్వాతే.. అంటే.!
సెప్టెంబర్‌లో మొదటి పార్ట్ రిలీజ్ అయిపోతుంది.. మరి రెండో పార్ట్ మాటేమిటి.? ప్రశాంత్ నీల్ ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది.
ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘సలార్’ రెండో పార్ట్ పట్టాలెక్కిస్తాడట. ఇదీ తాజాగా ‘సలార్’పై జరుగుతోన్న ప్రచారం.
మొదటి పార్ట్ కోసమే ఇంత టైమ్ తీసుకున్న ప్రబాస్ – ప్రశాంత్ నీల్.. ఇక ఆ రెండో పార్ట్ కోసం ఇంకెంత టైమ్ తీసుకుంటారో.. అని పెదవి విరుస్తున్నారు ఓ వర్గం సినీ జనం.