Pragathi F3 Movie మీకు తెలుసా.? అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్3’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ వుందని.! ఆ స్పెషల్ ఐటమ్ సాంగ్ చేసింది కూడా ప్రగతి అని.!
ఔనా.? నిజమా.? ఇది నిజంగానే షాకింగ్ విషయం. ఇందులో నిజమెంత.? ఏమోగానీ, అలాగని గాసిప్ క్వీన్ చెబుతోంది. ఎవరా గాసిప్ క్వీన్.? ఇంకెవరు ‘ఎఫ్3’లో నటించిన అందాల భామ మెహ్రీన్ కౌర్.
హనీ ఈజ్ ది బెస్ట్.. అంటూ ‘ఎఫ్2’ సినిమాలో సందడి చేసిన మెహ్రీన్, ‘ఎఫ్3’ సినిమాలో కూడా నటిస్తోంది. సెట్స్‌లో గాసిప్ క్వీన్ ఎవరంటే మెహ్రీన్.. అని అంటున్నారంతా. ఆ విషయాన్ని ప్రగతి కూడా ధృవీకరించింది.
గాసిప్ క్వీన్ మెహ్రీన్.!
షూటింగ్ స్పాట్లో ఖాళీగా వున్నప్పుడే కాదు, దర్శకుడు సీన్ స్టార్ట్ చేశాక కూడా మాట్లాడుతూనే వుంటుందట మెహ్రీన్. ఈ విషయాన్ని స్వయంగా ప్రగతి వెల్లడించడం గమనార్హం.
‘గాసిప్ క్వీన్ అని అందరూ అంటారు కదా.? ప్రగతి గురించి మంచి గాసిప్ చెప్పు..’ అని మెహ్రీన్‌ని అడిగితే, ఠక్కున మెహ్రీన్ ఏం చెప్పిందో తెలుసా.? ‘ఎప్3’ సినిమాలో ప్రగతి ఐటమ్ సాంగ్ చేసిందని.
ప్రగతి మంచి డాన్సర్. పలు సినిమాల్లో చిన్న చిన్న బిట్స్కి ఆమె డాన్స్ చేసింది కూడా. సోషల్ మీడియాలో ప్రగతి డాన్సులకు ఫిదా అయ్యే అభిమానులు చాలామందే వున్నారు.
Pragathi F3 Movie.. ప్రగతి స్పెషల్ సాంగ్.! ఆ కిక్కే వేరప్పా.!
ఐటమ్ సాంగ్ అని అనలేంగానీ, ప్రగతితో ఓ ఫుల్ స్పెషల్ సాంగ్ ఎవరైనా ముందు ముందు డిజైన్ చేసినా, ఆ సాంగ్‌కి ఆమె న్యాయం చేయగలదు.
మెహ్రీన్ పుట్టించిన సరదా గాసిప్ పుణ్యమా అని ఏ దర్శకుడైనా ప్రగతిలో స్పెషల్ ఐటమ్‌ని చూపిస్తే.. తెరపై ప్రగతి స్పెషల్ సాంగ్‌ని చూసే అవకాశం సినీ అభిమానులకు కలుగుతుంది.